ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు ప్రాథమిక పాఠశాల ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్ ప్రశాంత్ మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తన ఆత్మహత్యాయత్నానికి విద్యాశాఖ అధికారుల ఒత్తిళ్లే కారణమని పేర్కొంటూ ప్రశాంత్ సూసైడ్ నోట్‌లో ఆరోపించినట్లు తెలుస్తోంది. ఎంఈఓ చెరుకు రాజన్నతో పాటు జీవన్ రెడ్డి వల్ల తాను తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం.