గణేష్ లడ్డూ వేలంలో ₹2.20 లక్షలకు కౌకుట్ల జీవన్ రెడ్డి
భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా లడ్డూ వేలం
జై మాతా యూత్ ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమం
కీసర, మేజర్ న్యూస్ , (సెప్టెంబర్ 22):
నాగారం డివిజన్ రాంపల్లి పరిధిలో జై మాతా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలంలో స్థానికులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.గణేష్ లడ్డూ వేలంలో కౌకుట్ల జీవన్ రెడ్డి పాల్గొని 2 లక్షల 20 వేల ధరకు లడ్డూను దక్కించుకున్నారు. వేలం కార్యక్రమం సందర్భంగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవ సందడిని మరింత పెంచారు.జై మాతా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, స్థానిక యువతను, ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.