BREAKING
వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీలో కలకలం రేపిన ర్యాగింగ్ ఉదంతం సింగారం కింగ్ డైనమిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ సూర్య ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణపతి నవరాత్రులు: హోరాహోరీగా లడ్డూ వేలంపాట ది ప్యారడైజ్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టిన కయాదు లోహర్ తిరుమలలో కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి విఓఏ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు వినతిపత్రం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దిగ్గజ నటుడు అనంత్ నాగ్ భారీ వర్షాల నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం మెరుగైన వైద్యం కోసం సిఎంఆర్ఎఫ్ నిధులను పెంచాలి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గణేష్ లడ్డూ వేలంలో ₹2.20 లక్షలకు కౌకుట్ల జీవన్ రెడ్డి అన్నదానంతో ఆధ్యాత్మిక సేవ 25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం

Select Suryaa Now
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం


టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్
* 12 జిల్లాల్లో డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
* విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశం
* అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగించేలా ప్రత్యేక చర్యలు

 

 

విశాఖపట్నం, సెప్టెంబర్ 22, మేజర్ న్యూస్ : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ ద్వారా 12 జిల్లాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎండీ, విద్యుత్ వ్యవస్థ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు సిబ్బంది, వాహనాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.విద్యుత్ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేసేందుకు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎండీ తెలిపారు. హాస్పిటళ్లు, తాగునీటి పథకాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర అత్యవసర సేవలకు విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే, భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో తెగిపడిన విద్యుత్ వైర్లు, వాలిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిన చెట్ల కొమ్మల సమీపానికి వెళ్లరాదని వినియోగదారులకు సూచించారు. విద్యుత్ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేసి సహకరించాలని కోరారు.
జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు 
శ్రీకాకుళం - 9701400865   టెక్కలి  - 9490610050    పలాస - 08945241084
పార్వతీపురం మన్యం 
పాలకొండ  8332843546 పార్వతీపురం  9398594750
విజయనగరం
విజయనగరం టౌన్  9490610102 విజయనగరం రూరల్  9490610102 బొబ్బిలి  9490610121
విశాఖపట్నం
జోన్–I – 9490610019 జోన్–II – 9849628880 జోన్–III – 9491030722
అనకాపల్లి
అనకాపల్లి  9490610023 కశింకోట – 8333810597 నర్సీపట్నం – 9491030723
అల్లూరి సీతారామరాజు (ASR) 
పాడేరు 9490610027
కాకినాడ
జగ్గంపేట – 9490610097  కాకినాడ – 9490610856  పెద్దాపురం – 9493178728
తూర్పు గోదావరి 
రాజమహేంద్రవరం టౌన్  9490610855 రాజమహేంద్రవరం రూరల్  9490610859 నిడదవోలు  9493177540
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ 
అమలాపురం  9490610101 కొత్తపేట  9493178821
పశ్చిమ గోదావరి
నరసాపురం  7382050943 భీమవరం  9490610143 తాడేపల్లిగూడెం  9493177806 
ఏలూరు  9440904037 జంగారెడ్డిగూడెం  9491030712
పోలవరం 
రంపచోడవరం  8309771508
ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం 8331018762