పులివెందులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు పనులు చేసి చూపించాలి
పులివెందులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు.. పనులు చూపాలి
పులివెందులపై చంద్రబాబుకు ఉన్నది అభివృద్ధి ఆలోచనా? లేక రాజకీయ కక్షా? – వైసీపీ నేతల ధ్వజం
పులివెందుల మేజర్ న్యూస్:
పులివెందుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే కొత్తగా నిర్మించేది ఏమీ లేకపోయినా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు పేర్లు మార్చి క్రెడిట్ కొట్టేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఉందని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.
పులివెందులపై చంద్రబాబుకు ఈర్ష్య ఉంటే ఉండొచ్చని, కానీ ఆ రాజకీయ వైఖరికి పులివెందుల ప్రజలను బలిచేయడం మాత్రం సహించబోమని అన్నారు. ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడం, కొత్తగా ఏమీ చేయకుండా ప్రచార ఆర్భాటం చేయడం తప్ప కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పేరుతో పులివెందుల ప్రజలకు కొత్త ఆశలు చూపించడం కేవలం ఎన్నికల ప్రచారానికి పనికొచ్చే రాజకీయ స్టంట్ మాత్రమేనని వారు ఆరోపించారు. ఈ విధానం ద్వారా పులివెందుల మున్సిపాలిటీకి ఎంత నిధులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? ఏ పనులకు ఖర్చు చేస్తారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పేరుతో పెద్ద పెద్ద మాటలు చెప్పడం సులభమే కానీ, నిజంగా పులివెందులపై పెట్టుబడులు పెట్టించాలనే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు ముందుకు వచ్చిన ప్రైవేట్ సంస్థ ఏదో ప్రభుత్వం ప్రజల ముందు వెల్లడించాలని అన్నారు. కేవలం కాగితాలపై ప్రాజెక్టులు చూపించి, ప్రకటనలతో ప్రజలను నమ్మించే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు.
వాటర్ గ్రిడ్‌పై కూడా రాజకీయ ప్రచారమేనా?
పులివెందుల వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతున్న పని దీనిని పులివెందుల ప్రజల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ది ఒకసారి ప్రారంభమైన పథకాన్ని చంద్రబాబు ఆపాలని చూసిన ఆపలేని పరిస్థితి అందుకనే 80 శాతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసిన పనులను ప్రారంభించి క్రెడిట్ చోరీ చేయాలని కూటమి నాయకులు తాపత్రయపడుతున్నారు అన్నారు
ప్రతిపక్షంలో ఉన్న కోట్ల రూపాయలు ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నారు
మెడికల్ కాలేజీ సీట్లు వెనక్కు పంపించి పులివెందుల ప్రజలపై చంద్రబాబుకు ఉన్న కక్షను మరోసారి నిరూపించుకున్నారు
దాదాపు రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన ఒక్క రూపాయి పులివెందులకు ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు 20 కోట్లు ఇచ్చాము అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు
పులివెందులలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలంతా వైయస్ కుటుంబం పైనే మొగ్గు చూపుతారని తెలిపారు
ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ నూరుల్లా షబ్బీర్ బాబావల్లి బీసీ సెల్ అధ్యక్షులు కొట్లూరు సుదర్శన్ భాషా తదితరులు పాల్గొన్నారు