BREAKING
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు! గణేష్ నిమజ్జనం: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్! జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యామీ గౌతమ్ సందడి 'ఆర్టికల్ 370' చిత్రానికి ప్రశంసలు అవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు తెల్లకాగితం ట్రైలర్: టీనేజ్ లవ్ స్టోరీతో అలరిస్తున్న హర్ష్ రోషన్.. గాంధీ జయంతికి విడుదల! ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం వేలంపాటల్లో భక్తుల పోటాపోటీ.. భారీ ధరలకు లడ్డూ, వెండి వస్తువులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న డా. చినుకని శివ ప్రసాద్ 50 ఏళ్ల గణపతి మహోత్సవ చరిత్రకు సావనీర్‌ రూపం Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్ పులివెందులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు పనులు చేసి చూపించాలి

అవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు

Select Suryaa Now
అవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు

*ఆవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు
వెలిదెండ్లలో రైతు వరధారెడ్డి తోట సందర్శన*


లింగాల మేజర్ న్యూస్:- వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చేరుకూరి  శ్రీధర్ లింగాల మండలం వెలిదెండ్ల గ్రామంలోని ఆవకాడో రైతు వరధారెడ్డి తోటను ఆకస్మికంగా సందర్శించారు. ఆవకాడో మొక్కల ఎదుగుదల, సాగు విధానం, రకాలు, దిగుబడి తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు.
ఆవకాడో సాగులో రైతు అనుసరిస్తున్న ఆధునిక పద్ధతులను కలెక్టర్ అభినందించారు. వరధారెడ్డి తోటలోని నాణ్యమైన మదర్ ప్లాంట్ల నుంచి మంచి రకాలను ఎంపిక చేసి నర్సరీని అభివృద్ధి చేయాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మొక్కలను ఇతర రైతులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జిల్లాలో ఆవకాడో సాగును మరింత విస్తరించాలని సూచించారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆవకాడో సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న వరధారెడ్డిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి హరి ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరావు, ఏడీఏ ప్రభాకర్ రెడ్డి, ఉద్యాన అధికారి శ్రీమతి దీప, మండల వ్యవసాయ అధికారి రమేష్, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.