BREAKING
25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం! ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు!

పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు

Select Suryaa Now
పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు

పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్లు

ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి ఆదర్శ మున్సిపా లిటీగా తీర్చిదిద్దుతాం: బీటెక్ రవి

పట్టణ మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం: కలెక్టర్ చెరుకూరి శ్రీధర్

పులివెందుల మేజర్ న్యూస్, :


పులివెందుల మున్సిపా లిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న రూ.20 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో ప్రారంభించిన పనులను పూర్తి చేసి పట్టణ రూపురేఖలను మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూ.11,359 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పులివెందుల మున్సిపాలిటీకి రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

పులివెందుల మున్సిపల్ కార్యాలయం వేదికగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అవసరమైన తాగునీరు, పారిశుధ్యం, కాలువలు, రహదారులు, విద్యుత్ దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లాలోని తొమ్మిది పురపాలక సంఘాల పరిధిలో గత ఆరు నెలల్లో సుమారు రూ.1,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.40 కోట్ల పట్టణ అభివృద్ధి నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరో రూ.11.90 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. వీటిని నిర్దేశిత కాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

పులివెందుల ప్రాంత ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో రూ.480 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పులివెందుల మెగా తాగునీటి పథకం పనులు తుది దశకు చేరుకున్నా యని కలెక్టర్ తెలిపారు. ఈ పథకం ద్వారా పులివెందుల నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు మున్సిపాలిటీ ప్రజలకు కూడా తాగునీటి అవసరాలు తీరనున్నాయని పేర్కొన్నారు.ఈ పథకంలో పనులు 96 శాతం పూర్తయ్యాయని ఆగస్టులో వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. తొలుత రూ.480 కోట్ల అంచనా వ్యయంతో పథకాన్ని చేపట్టినట్లు గతంలోనూ నివేదికలు వెల్లడించాయి. 
తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

గత పనులపై బీటెక్ రవి విమర్శలు

పులివెందుల మున్సిపాలిటీలో గతంలో చేపట్టిన కొన్ని పనులపై బీటెక్ రవి విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో మున్సిపల్ నిధుల వినియోగంపై ఆరోపణలు వచ్చాయని, ప్రజా అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొన్ని పనులకు నిధులు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు.
విగ్రహాలను తొలగించి తిరిగి ఏర్పాటు చేయడం, నిర్మాణాలను తొలగించి మళ్లీ నిర్మించడం, మున్సిపల్ బస్టాండ్‌ను కూల్చి కొత్త నిర్మాణం చేపట్టడం వంటి పనుల వల్ల ప్రజాధనం వృథా అయిందని ఆయన విమర్శించారు. ఎర్రపల్లె చెరువుకు నీరు సక్రమంగా అందించలేకపోయినా బోటింగ్ పేరుతో భారీగా ఖర్చు చేశారని ఆరోపించారు. భూగర్భ మురుగునీటి కాలువల పనుల పేరుతో రోడ్లు తవ్వి పనులు పూర్తికాకపో వడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు

పట్టణంలోని రాణితోట ప్రాంత రహదారి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని, శ్రీనాథ్ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను కూడా పూర్తి చేస్తామని బీటెక్ రవి తెలిపారు. గతంలో మిగిలిపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా గుర్తించి పరిష్కరిస్తామని చెప్పారు.ప్రజాధనం వృథా కాకుండా అందుబాటులో ఉన్న ప్రతి రూపాయిని పట్టణ అభివృద్ధికే వినియోగిస్తామని తెలిపారు. ప్రారంభించిన పనులను సుమారు ఆరు నెలల్లో పూర్తి చేసి పులివెందుల మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇళ్ల యాజమాన్య హక్కులపై దృష్టి

పులివెందులలో పదేళ్లకు పైగా నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు యాజమాన్య హక్కులు కల్పించే అంశంపై చర్యలు చేపడతామని బీటెక్ రవి తెలిపారు. నగర్‌గుట్టలోని సుమారు 3,000 ఇళ్లు, రెండు జయమ్మ కాలనీలు, రాజారెడ్డి నగర్ ప్రాంతాల్లోని కుటుంబాల సమస్యలను పరిశీలిస్తామని చెప్పారు.
ఇల్లు ఉన్నప్పటికీ యాజమాన్య రికార్డుల్లో పేరు లేకపోవడం, ఇంటి సంఖ్య ఉన్నా హక్కుల వివరాలు నమోదు కాకపోవడం వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఉప రిజిస్ట్రార్‌లతో చర్చిస్తామని తెలిపారు. అర్హత ఉన్నవారికి నిబంధనల ప్రకారం యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

“ ఇద్దరు సీఎం లు ఉన్న పులివెందులకే తాగునీరు ఇవ్వలేకపోయారు”

“వైఎస్సార్, జగన్ ఇద్దరినీ ముఖ్యమంత్రులుగా చేసిన పులివెందులకే తాగునీరు ఇవ్వలేకపోయారు. మేము వచ్చి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించే దిశగా పనులు పూర్తి చేస్తున్నాం” అని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. గత పాలనపై విమర్శలు చేశారు.పులివెందుల తాగునీటి పథకానికి సంబంధించి 2026 ఆగస్టు నాటికి పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి చిన్నయ్య, మున్సిపల్ కమిషనర్ తనూజ, మాజీ శాసనమండలి సభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పొరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.