BREAKING
భారత్‌కు డ్రోన్లు విక్రయిస్తున్న సంస్థపైనే పాకిస్తాన్ ట్రంప్ బెట్: సరికొత్త రక్షణ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి ఇథియోపియాలో వేడెక్కిన అంతర్యుద్ధం: అబీ అహ్మద్ ప్రభుత్వానికి ఏడు తిరుగుబాటు గ్రూపుల కూటమి ముప్పు ఎంత? విదేశాల్లో భారతీయ యువతకు బంపర్ ఆఫర్ ఇరాన్‌తో ఒప్పందం అంత సులువు కాదు: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టీకరణ వెనిజులా రుణ పునర్వ్యవస్థీకరణపై ట్రంప్‌తో కీలక చర్చలు నల్లగొండలో శోభాయమానంగా గణనాథుడి శోభయాత్ర ఒమన్ తీరంలో భారత్‌కు వస్తున్న కార్గో నౌకపై క్షిపణి దాడి బ్రెజిల్ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ అర్బన్, మేజర్ నేపాల్‌లో భయంకరమైన వర్ష సూచిక ఐరాస మానవ హక్కుల మండలిలో భారత్ గిరిజన అభివృద్ధి నమూనాకు ప్రశంసలు రజనీకాంత్ జైలర్ 2 పాటపై డేవిడ్ వార్నర్ సరదా స్పందన.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో! మేము ఉగ్రవాదులం కాదు, ఉగ్రవాదానికి బాధితులం: ఐరాసలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దీటైన బదులు ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి: భారత నావికుడు మృతి, మరో 19 మంది రక్షణ వారణాసి షూటింగ్‌లో మహేష్ బాబు పార్ట్ కంప్లీట్.. రాజమౌళి మూవీపై లేటెస్ట్ అప్‌డేట్!

మెరుగైన వైద్యం కోసం సిఎంఆర్ఎఫ్ నిధులను పెంచాలి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

Select Suryaa Now
మెరుగైన వైద్యం కోసం సిఎంఆర్ఎఫ్ నిధులను పెంచాలి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

పేదలకు మెరుగైన వైద్యం కొరకు సిఎంఆర్ఎఫ్ నిధులను పెంచాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు,మేజర్ న్యూస్:

పేదలకు మెరుగైన వైద్యం కోసం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ నిధులను ప్రభుత్వం పెంచాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోనీ సిపిఐ కార్యాలయంలో పలువురికి మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య విషయంలో ప్రభుత్వం నిధులను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి కేటాయిస్తున్న నిధులు సరిపోక ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు విద్యా, వైద్యాన్ని ఉచితంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగూరి నరసింహ, బచ్చనగోని గాలయ్య, తీర్పారు వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శులు చాపల శ్రీనివాస్, నలపరాజు సతీష్, బొడిగ సైదులు, సత్యం, పాండు, వెంకన్న, కట్కూరు లింగస్వామి, గోపగోని ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.