ఆరేగూడెంలో రికార్డు ధర పలికిన లడ్డూ
చౌటుప్పల్, మేజర్ న్యూస్:మండలంలోని ఆరేగూడెంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పిసాటి అవినాష్‌రెడ్డి రూ.2,83,000కు లడ్డూను కైవసం చేసుకున్నారు. దీంతో ఆరేగూడెం గణపతి లడ్డూ వేలంలో ఈ ధర నమోదైంది. వేలం కార్యక్రమంలో గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు. లడ్డూను దక్కించుకున్న అవినాష్‌రెడ్డిని శివాజీ యూత్ సభ్యులు అభినందించారు.