BREAKING
పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామాల వారీగా సమీక్ష ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హోమ్ కంపోస్టింగ్‌పై ప్రజలకు అవగాహన ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం: ఎస్ఐఆర్ వివాదంపై బీజేపీ స్పష్టత గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలి సిద్ధార్థ్–తమన్నా ‘ది వాన్’.. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్! వేలంపాటలో వెండి బిల్లను దక్కించుకున్న కాచన శ్రీనివాస్ రెడ్డి పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కడపలో దంచికొట్టిన వర్షం.. జలమయమైన రహదారులు ఆచార్య జయశంకర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం కీర్తి సురేష్ ‘డోరతీ’ మూవీ ట్రైలర్ అప్‌డేట్.. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం! భారత్-షార్జా మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతంపై ఉన్నత స్థాయి చర్చలు ఈనెల 30 లోపు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి ఘనంగా గణనాధుల నిమజ్జనం వేడుకలు జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో తీవ్ర మితవాద పార్టీల పురోగతి: భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న రాయబారి జాస్పర్ వీక్

పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా

Select Suryaa Now
పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా

 

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 23):వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆశా వర్కర్ హత్య కేసుకు సంబంధించి స్థానిక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దశాకాలం కిందట చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై విచారణ పూర్తి చేసిన గౌరవ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ జ్యుడీషియల్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మహిళను సజీవదహనం చేసిన నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు కఠిన శిక్షను ఖరారు చేశారు. ఈ తీర్పు వివరాలను వికారాబాద్ జిల్లా ఎస్పీ అధికారికంగా మీడియాకు వెల్లడించారు. పరిగి మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన బ్యాగరి కమల అనే ఆశా వర్కర్ తన కుమార్తెతో కలిసి నివాసం ఉంటుండగా, అదే గ్రామానికి చెందిన రావులగల్ల దేవదాసు అనే వ్యక్తి గతంలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలరీత్యా తన ఇంటికి రావద్దని కమల అతన్ని తీవ్రంగా వారించినప్పటికీ, నిందితుడు తీరు మార్చుకోకుండా తరచూ మద్యం మత్తులో ఆమె ఇంటికి వచ్చి గొడవలకు దిగేవాడు. ఈ కక్షను మనసులో ఉంచుకున్న నిందితుడు పదేళ్ల క్రితం రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ దారుణ ఘటనపై అప్పట్లో పరిగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తును తీవ్రతరం చేశారు. నాటి దర్యాప్తు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వైద్యపరమైన ఆధారాలను సేకరించి, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. పకడ్బందీగా సేకరించిన సాంకేతిక మరియు భౌతిక సాక్ష్యాలను కోర్టులో సమర్పించి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత కాలంలో జరిగిన న్యాయ విచారణలో భాగంగా అదనపు పీపీ మరియు పోలీస్ శాఖ సమన్వయంతో కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. బ్రీఫింగ్ అండ్ లైజన్ అధికారుల సహకారంతో సాక్ష్యాలను ఎప్పడూ తప్పుకుండా న్యాయస్థానం ముందుంచడంతో నేరం నిరూపణ సులభమైంది. అన్ని కోణాల నుంచి విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడిపై మోపబడిన అభియోగాలు నిజమని నిర్ధారించింది. ఈ మేరకు రావులగల్ల దేవదాసుకు జీవిత ఖైదు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు సేకరించి, నిందితునికి సకాలంలో శిక్ష పడేలా నిరంతరం శ్రమించిన పోలీసు అధికారుల బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో మహిళలపై అరాచకాలకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదని, ఇలాంటి కఠిన తీర్పులు నేరస్థులకు గుణపాఠం కావాలని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ నేరాలకు పాల్పడేవారిపై చట్టపరమైన ఉక్కుపాదం మోపుతామని, బాధితులకు సత్వర న్యాయం అందించేలా వికారాబాద్ జిల్లా పోలీసులు ఎప్పుడూ ముందుంటారని అధికారులు భరోసా కల్పించారు.