BREAKING
పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామాల వారీగా సమీక్ష ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హోమ్ కంపోస్టింగ్‌పై ప్రజలకు అవగాహన ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం: ఎస్ఐఆర్ వివాదంపై బీజేపీ స్పష్టత గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలి సిద్ధార్థ్–తమన్నా ‘ది వాన్’.. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్! వేలంపాటలో వెండి బిల్లను దక్కించుకున్న కాచన శ్రీనివాస్ రెడ్డి పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కడపలో దంచికొట్టిన వర్షం.. జలమయమైన రహదారులు ఆచార్య జయశంకర్ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం కీర్తి సురేష్ ‘డోరతీ’ మూవీ ట్రైలర్ అప్‌డేట్.. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం! భారత్-షార్జా మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతంపై ఉన్నత స్థాయి చర్చలు ఈనెల 30 లోపు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి ఘనంగా గణనాధుల నిమజ్జనం వేడుకలు జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో తీవ్ర మితవాద పార్టీల పురోగతి: భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న రాయబారి జాస్పర్ వీక్

పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి

Select Suryaa Now
పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి

**పేదల ఇళ్లకు పూర్తి హక్కులు కల్పించడమే లక్ష్యం*

*అధికారులతో సమీక్ష చేసిన బీటెక్ రవి**

పులివెందుల మేజర్ న్యూస్:

* పులివెందుల నియోజకవర్గంలో  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సెప్టెంబర్ 30వ తేదీన పులివెందులలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి  పులివెందుల ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ మరియు వేంపల్లె ఎంఆర్ఓ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తీసుకువచ్చిన డికెటి  మరియు ప్రభుత్వ ఇళ్లను పట్టాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేయాలని సంకల్పించారు.
కలెక్టర్  ప్రత్యేక దృష్టితో పులివెందుల మున్సిపాలిటీ లోని సుమారు 4,000 ప్రభుత్వ, డికెటి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా లబ్ధిదారులకు వారి సొంత ఇంటి మీద పూర్తి హక్కులు లభించడంతో పాటు, బ్యాంకు లోన్లు మరియు పిల్లల విద్యకు అవసరమైన రుణాలు పొందే అవకాశం కలుగుతుంది.
 రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖల నుండి ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, లబ్ధిదారులకు కావలసిన పత్రాలు మరియు సర్టిఫికెట్లు ఎక్కడా పెండింగ్ లేకుండా వేగంగా అందించాలని కోరారు.
ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం పర్యటనలోపు ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.