ఈనెల 30 లోపు పేదల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి
ఈ నెల 30లోపు పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి
*సబ్ రిజిస్ట్రార్‌కు స్పష్టమైన ఆదేశాలు.. బీటెక్ రవి*
పులివెందుల మేజర్ న్యూస్:
* పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పులివెందుల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సబ్-రిజిస్ట్రార్ ని కలవడం జరిగింది.
పేదలకు కేటాయించిన డి.కె.టి. మరియు ప్రభుత్వ ఇళ్లను పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించి, వారికి పూర్తి హక్కులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో బుధవారం సబ్-రిజిస్ట్రార్‌ను కలిసి మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖల నుంచి రిజిస్ట్రేషన్‌కు కావలసిన పత్రాల గురించి చర్చించారు.
* కలెక్టర్ ఆదేశాలను పక్కన పెట్టకుండా ఈ నెల 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, దానికి కావలసిన పత్రాలను రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖలు ఇచ్చేలా ఆదేశించామని తెలిపారు.
* ఎలాంటి తప్పులు, అలసత్వం లేకుండా కచ్చితంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసి, పేద ప్రజలకు పట్టాలు అందేలా డి.కె.టి. లబ్ధిదారులకు పట్టాదారులుగా రిజిస్ట్రేషన్ చేయించేలా కృషి చేయాలని సబ్-రిజిస్ట్రార్ ని బీటెక్ రవి ఆదేశించారు.