తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం
శ్రీకాకుళం జిల్లాకు ఉత్తరంగా తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకింది. ప్రస్తుతం వాయుగుండం పూర్తిగా తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. మరో కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనజీవనం ప్రభావితమవుతోంది. మరోవైపు తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.
తీవ్ర వాయుగుండం పూర్తిగా తీరం దాటిన అనంతరం దాని ప్రభావంతో మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు కొనసాగే అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.