BREAKING
ఘనంగా గణనాధుల నిమజ్జనం వేడుకలు జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో తీవ్ర మితవాద పార్టీల పురోగతి: భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న రాయబారి జాస్పర్ వీక్ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు సన్నాహాలు శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం అధికారుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో అవసరం కొప్పర్తి 'ట్రియో విజన్' పరిశ్రమను సందర్శించిన వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు: ఆధ్యాత్మిక చైతన్యంతోనే నిజమైన ప్రగతి అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్లాక్‌బస్టర్ ‘డ్రాగన్’ మూవీలో నటించాల్సిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు! శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రమాదం చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛతను సాధిద్దాం పుష్పగిరిలో ప్రతిష్టాత్మకంగా 'బిన్ బాగ్' సర్వే తడి, పొడి చెత్త విభజనపై డిప్యూటీ ఎంపీడీవో రమేష్ అవగాహన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన అవసరం మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చు డా. జి. వంశీ విహారి.. ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి-జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. అయ్యపురెడ్డి శ్రీశైలం ధర్మకర్తల మండలి 11వ సమావేశం న్యూయార్క్ చర్చల్లో ఇరాన్ కీలక షరతులు: షిప్పింగ్ దిగ్బంధం ఎత్తివేత, ఆస్తుల విడుదలపైనే దౌత్యపరమైన ముందడుగు

చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛతను సాధిద్దాం పుష్పగిరిలో ప్రతిష్టాత్మకంగా 'బిన్ బాగ్' సర్వే తడి, పొడి చెత్త విభజనపై డిప్యూటీ ఎంపీడీవో రమేష్ అవగాహన

Select Suryaa Now
చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛతను సాధిద్దాం  పుష్పగిరిలో ప్రతిష్టాత్మకంగా 'బిన్ బాగ్' సర్వే  తడి, పొడి చెత్త విభజనపై   డిప్యూటీ ఎంపీడీవో రమేష్ అవగాహన

చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛతను సాధిద్దాం

పుష్పగిరిలో ప్రతిష్టాత్మకంగా 'బిన్ బాగ్' సర్వే

తడి, పొడి చెత్త విభజనపై

డిప్యూటీ ఎంపీడీవో రమేష్ అవగాహన


వల్లూరు మేజర్ న్యూస్:

మండల పరిధిలోని పుష్పగిరి గ్రామంలో బుధవారం పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో 'బిన్ బాగ్' సర్వేను విస్తృతంగా నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సర్వేలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వల్లూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ ఇంటింటికీ తిరిగి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు ప్రజలందరూ తమ ఇళ్లలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్తను ఒకే దగ్గర వేయకుండా, తప్పనిసరిగా తడి చెత్త, పొడి చెత్తగా విడివిడిగా భద్రపరచాలని ఆయన సూచించారు. అలా ఇంటివద్దనే వేరు చేసిన తడి చెత్తను గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ప్రతిరోజూ వచ్చే పంచాయతీ 'హరిత రాయబారులకు మాత్రమే అందజేయాలని కోరారు. అదేవిధంగా, పొడి చెత్త నిర్వహణపై ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. పొడి చెత్తలో భాగమైనటువంటి పనికిరాని ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు, పాత ఇనుము వంటి వ్యర్థాలను వీధుల్లో, కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా జాగ్రత్తగా ఒకచోట చేర్చాలన్నారు. అలా సేకరించిన ప్లాస్టిక్ మరియు ఇనుప వ్యర్థాలను గ్రామాల్లోకి వచ్చే 'స్వచ్ఛ రథానికి' అందజేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని ఆయన వివరించారు. ప్రజలను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. స్వచ్ఛ రథానికి పొడి చెత్తను అందజేసిన వారికి, ఆ వ్యర్థాలకు బదులుగా వారి ఇంటికి ఉపయోగపడే పలు విలువైన వస్తువులను బహుమతులుగా అందజేస్తామని ప్రకటించారు. గ్రామస్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని, చెత్త నుంచి సంపద సృష్టించే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరి సహకారంతోనే పుష్పగిరిని ఆదర్శవంతమైన, పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దగలం అని డిప్యూటీ ఎంపీడీవో రమేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పంచాయతీ సిబ్బంది, హరిత రాయబారులు తదితరులు పాల్గొన్నారు..