BREAKING
తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు సన్నాహాలు శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం అధికారుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో అవసరం కొప్పర్తి 'ట్రియో విజన్' పరిశ్రమను సందర్శించిన వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు: ఆధ్యాత్మిక చైతన్యంతోనే నిజమైన ప్రగతి అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్లాక్‌బస్టర్ ‘డ్రాగన్’ మూవీలో నటించాల్సిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు! శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రమాదం చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛతను సాధిద్దాం పుష్పగిరిలో ప్రతిష్టాత్మకంగా 'బిన్ బాగ్' సర్వే తడి, పొడి చెత్త విభజనపై డిప్యూటీ ఎంపీడీవో రమేష్ అవగాహన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన అవసరం మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చు డా. జి. వంశీ విహారి.. ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి-జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. అయ్యపురెడ్డి శ్రీశైలం ధర్మకర్తల మండలి 11వ సమావేశం న్యూయార్క్ చర్చల్లో ఇరాన్ కీలక షరతులు: షిప్పింగ్ దిగ్బంధం ఎత్తివేత, ఆస్తుల విడుదలపైనే దౌత్యపరమైన ముందడుగు పులివెందులలో బీటెక్ రవి సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా

ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి-జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. అయ్యపురెడ్డి

Select Suryaa Now
ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి-జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. అయ్యపురెడ్డి

 

-సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె,  నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు

నంద్యాల అర్బన్ : యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, నంద్యాల జిల్లాలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా అన్ని బ్యాంకులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని బ్యాంకులకు నంద్యాల జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.అయ్యపురెడ్డి గారు తెలిపారు.

అదేవిధంగా సెప్టెంబర్ 26 నాల్గవ శనివారం, సెప్టెంబర్ 27 ఆదివారం కావడంతో, సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు సాధారణ బ్యాంకు శాఖల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రజలకు అవసరమైన ముఖ్యమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా బ్యాంకులు తగిన SLBC మార్గదర్శకాలు Business Continuity Plan (BCP) అమలు చేయాలని సూచించారు.
బ్యాంకులకు ముందస్తు ఏర్పాట్లపై సూచనలు: బి.అయ్యపురెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకులు కింది చర్యలను ముందుగానే చేపట్టాలని తెలిపారు:
•    NTR భరోసా పింఛన్లు:  అన్ని బ్యాంకులు సెప్టెంబర్ నెల పింఛన్ల చెల్లింపులకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ శాఖలు/పెన్షన్ పంపిణీ అధికారులతో సమన్వయం చేసుకొని ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి.
•    నగదు లభ్యత: ముఖ్యమైన శాఖలు, నగదు పంపిణీ కేంద్రాల్లో ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా తగినంత నగదు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
•    ATMలు మరియు CRMs: జిల్లాలోని ATMలు, Cash Recycler Machines (CRMs)లో తగినంత నగదు ఉండేలా ముందస్తు క్యాష్ లోడింగ్ మరియు రీప్లెనిష్మెంట్ ఏర్పాట్లు చేయాలి.
•    నిరంతర పర్యవేక్షణ: ATMలు/CRMsలో నగదు లభ్యతను నిరంతరం పర్యవేక్షించి, అవసరమైన చోట వెంటనే నగదు భర్తీ చేసే విధంగా contingency arrangements ఏర్పాటు చేయాలి.
•    డిజిటల్ బ్యాంకింగ్: Internet Banking, Mobile Banking, UPI తదితర డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా బ్యాంకులు అవసరమైన అంతర్గత ఏర్పాట్లు చేసుకోవాలి.
•    ప్రభుత్వ చెల్లింపులు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు మరియు ఇతర ప్రభుత్వ ఆధారిత చెల్లింపుల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.
•    ప్రజలకు ముందస్తు సమాచారం: బ్యాంకు సమ్మె మరియు వరుస సెలవుల పరిస్థితిని ఖాతాదారులకు ముందుగానే తెలియజేసి, ప్రత్యామ్నాయ డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి. నంద్యాల జిల్లా ప్రజలు సెప్టెంబర్ 25, 2026లోగా తమకు అవసరమైన ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.అయ్యపురెడ్డి సూచించారు. ముఖ్యంగా నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెక్కుల లావాదేవీలు, రుణ వాయిదాల చెల్లింపులు, ప్రభుత్వ/ఇతర ముఖ్యమైన చెల్లింపులు అవసరమున్న వారు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా సెప్టెంబర్ 25, 2026లోగా ముందుగానే పూర్తి చేసుకోవాలని కోరారు.అత్యవసర అవసరాల కోసం ప్రజలు ATM లు, Cash Recycler Machines, UPI, Internet Banking, Mobile Banking తదితర డిజిటల్ మరియు ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. నంద్యాల జిల్లాలో బ్యాంకింగ్ సేవలకు సాధ్యమైనంత వరకు అంతరాయం కలగకుండా అన్ని బ్యాంకులు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఖాతాదారులకు అవసరమైన సహకారం అందించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.అయ్యపురెడ్డి సూచించారు.