BREAKING
తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు సన్నాహాలు శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం అధికారుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో అవసరం కొప్పర్తి 'ట్రియో విజన్' పరిశ్రమను సందర్శించిన వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు: ఆధ్యాత్మిక చైతన్యంతోనే నిజమైన ప్రగతి అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్లాక్‌బస్టర్ ‘డ్రాగన్’ మూవీలో నటించాల్సిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు! శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రమాదం చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛతను సాధిద్దాం పుష్పగిరిలో ప్రతిష్టాత్మకంగా 'బిన్ బాగ్' సర్వే తడి, పొడి చెత్త విభజనపై డిప్యూటీ ఎంపీడీవో రమేష్ అవగాహన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన అవసరం మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చు డా. జి. వంశీ విహారి.. ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి-జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. అయ్యపురెడ్డి శ్రీశైలం ధర్మకర్తల మండలి 11వ సమావేశం న్యూయార్క్ చర్చల్లో ఇరాన్ కీలక షరతులు: షిప్పింగ్ దిగ్బంధం ఎత్తివేత, ఆస్తుల విడుదలపైనే దౌత్యపరమైన ముందడుగు పులివెందులలో బీటెక్ రవి సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా

పులివెందులలో బీటెక్ రవి సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

Select Suryaa Now
పులివెందులలో బీటెక్ రవి సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

*మున్సిపల్ ఎన్నికల వేళ జగన్‌కు భారీ షాక్ ఇచ్చిన బిటెక్ రవి

బీటెక్ రవి సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

పులివెందుల మేజర్ న్యూస్:

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని జెండామాను వీధికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పులివెందుల టీడీపీ నాయకులు తూగుట్ల మధుసూదన్ రెడ్డి, ఆధ్వర్యంలో జెండామాను చిన్నతో సహా  50 కుటుంబాలు   టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు సాదరంగా స్వాగతం పలికారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందనకు ఈ చేరికలు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పులివెందుల టీడీపీ నాయకులు,
మద్దూరు వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ఉర్డు &హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాష పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్,పులివెందుల పట్టణ అధ్యక్షుడు అన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, నల్లాగారి భాస్కర్ రెడ్డి 
ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.