BREAKING
శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం అధికారుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో అవసరం కొప్పర్తి 'ట్రియో విజన్' పరిశ్రమను సందర్శించిన వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు: ఆధ్యాత్మిక చైతన్యంతోనే నిజమైన ప్రగతి అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్లాక్‌బస్టర్ ‘డ్రాగన్’ మూవీలో నటించాల్సిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు! శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రమాదం చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛతను సాధిద్దాం పుష్పగిరిలో ప్రతిష్టాత్మకంగా 'బిన్ బాగ్' సర్వే తడి, పొడి చెత్త విభజనపై డిప్యూటీ ఎంపీడీవో రమేష్ అవగాహన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన అవసరం మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చు డా. జి. వంశీ విహారి.. ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి-జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. అయ్యపురెడ్డి శ్రీశైలం ధర్మకర్తల మండలి 11వ సమావేశం న్యూయార్క్ చర్చల్లో ఇరాన్ కీలక షరతులు: షిప్పింగ్ దిగ్బంధం ఎత్తివేత, ఆస్తుల విడుదలపైనే దౌత్యపరమైన ముందడుగు పులివెందులలో బీటెక్ రవి సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా వర్షాకాలంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలి పులివెందుల మున్సిపల్ కమిషనర్ తనూజ

అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా

Select Suryaa Now
అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా

బీసీ అభ్యర్థిగా తప్పనిసరిగా విజయం సాధిస్తా,,,

రాజంపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు దొంతం శివ ప్రసాద్ వినతి

అమరావతి, మేజర్ న్యూస్;

తనకు రాజంపేట మున్సిపల్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా విజయం సాధించి తెలుగుదేశం జెండా ఎగరవేస్తానని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ రాష్ట్ర టిడిపి అధ్యక్షున్ని కోరారు. బుధవారం 
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి దొంతం శివ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాబోయే రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని పల్లా శ్రీనివాస్ ని దొంతం శివ ప్రసాద్ కోరారు.
తాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని, పార్టీ కోసం ఎంతోకాలంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నానని రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే విధంగా తనకు ఈ అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్  మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని, బీసీల రాజకీయ సాధికారతకు పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. పార్టీ అధిష్ఠానం అన్ని అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జగన్మోహన్ రాజు  నాయకత్వంలో రాజంపేట మున్సిపాలిటీ ఇప్పటికే అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న నేపధ్యంలో తనకు చైర్మన్ అవకాశం కల్పిస్తే ఇంచార్జి ఆధ్వర్యంలో మరింత  అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని దొంతం శివ ప్రసాద్ తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం సానుకూలంగా పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.