శ్రీశైలం ధర్మకర్తల మండలి 11వ సమావేశం
శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి 11వ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అధ్యక్షులు పోతుకుంట రమేష్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 20 అంశాలపై చర్చించారు. 18 అంశాలను ఆమోదించి, 2 అంశాలను వాయిదా వేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. అక్టోబర్ 11వ తేదీ నుండి శ్రీశైలంలో దసరా మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం పాలకమండలి ఎప్పటికప్పుడు ఆయా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.