వర్షాకాలంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలి పులివెందుల మున్సిపల్ కమిషనర్ తనూజ
వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి
పులివెందుల మున్సిపల్ కమిషనర్
పులివెందుల మేజర్ న్యూస్ :
వర్షాకాలం నేపథ్యంలో పులివెందుల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులివెందుల మున్సిపల్ కమిషనర్ తనూజ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్య లోపాలు ఏర్పడటం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు, విరేచనాలు తదితర కాలానుగుణ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన సూచనలు:
1. విద్యుత్ స్తంభాలు, చెట్ల వద్ద అప్రమత్తత:
వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెట్లు, పాడైపోయిన లేదా బలహీనంగా ఉన్న భవనాల సమీపంలో లేదా వాటి క్రింద ప్రజలు ఉండకూడదు. గోడలు, పైకప్పులు లేదా ఇతర నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలి.
2. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి:
పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఖాళీ కంటైనర్లు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.
3. సురక్షితమైన తాగునీటిని వినియోగించాలి:
తాగునీటిని బాగా మరిగించి, కొద్దిగా చల్లారిన తరువాత మాత్రమే వినియోగించాలని సూచించారు. శుభ్రమైన, సురక్షితమైన నీటినే తాగాలని తెలిపారు.
4. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి:
చేతులను సబ్బుతో తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా ఆహారం తీసుకునే ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు.
5. చెత్తను కాలువల్లో వేయకూడదు:
చెత్తను కాలువలు, మురుగు కాలువలు, నీటి వనరులు లేదా రోడ్లపై వేయకూడదు చెత్త కాలువల్లో పేరుకుపోవడం వల్ల డ్రైనేజీ నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి మీరు నిలిచిపోయే అవకాశం ఉంది ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను డోర్ టు డోర్ చెత్త సేకరణ వాహనాలకు మాత్రం అందజేయాలని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు