BREAKING
జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో తీవ్ర మితవాద పార్టీల పురోగతి: భారత్-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న రాయబారి జాస్పర్ వీక్ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు సన్నాహాలు శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం అధికారుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో అవసరం కొప్పర్తి 'ట్రియో విజన్' పరిశ్రమను సందర్శించిన వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు: ఆధ్యాత్మిక చైతన్యంతోనే నిజమైన ప్రగతి అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్లాక్‌బస్టర్ ‘డ్రాగన్’ మూవీలో నటించాల్సిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు! శ్రీశైలం ఘాట్ రోడ్ లో ప్రమాదం చెత్తను వేరు చేద్దాం.. స్వచ్ఛతను సాధిద్దాం పుష్పగిరిలో ప్రతిష్టాత్మకంగా 'బిన్ బాగ్' సర్వే తడి, పొడి చెత్త విభజనపై డిప్యూటీ ఎంపీడీవో రమేష్ అవగాహన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన అవసరం మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చు డా. జి. వంశీ విహారి.. ప్రజలందరూ సెప్టెంబర్ 25 లోగా ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలి-జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. అయ్యపురెడ్డి శ్రీశైలం ధర్మకర్తల మండలి 11వ సమావేశం న్యూయార్క్ చర్చల్లో ఇరాన్ కీలక షరతులు: షిప్పింగ్ దిగ్బంధం ఎత్తివేత, ఆస్తుల విడుదలపైనే దౌత్యపరమైన ముందడుగు పులివెందులలో బీటెక్ రవి సమక్షంలో టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

అధికారుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Select Suryaa Now
అధికారుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 23):వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షత జరిగిన దిశ సమావేశం తీవ్ర వాడీవేడీగా సాగింది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల ప్రగతి అలాగే అధికారుల పనితీరుపై ఈ సమావేశంలో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు అంశాలపై మండిపడ్డారు. ముఖ్యంగా ప్రోటోకాల్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులతోనే జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజా ప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కోట్‌పల్లి మరియు పూడూరు మండలాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నిబంధనలు పాటించకపోవడంపై ఆయన అధికారులను నిలదీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని యాలాల మండలం జుంటుపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన స్లూయిస్ గేట్ మరమ్మతులు ఇప్పటివరకు పూర్తి కాకపోవడంపై తీవ్రస్థధిలో ప్రశ్నించారు. ఈ పనిని తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో లేదా అవసరమైతే వ్యక్తిగత నిధులతో చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా మైనింగ్ శాఖ ఏడీ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, పులుసుమామిడి మరియు రాకంచెర్ల గ్రామాల్లో వస్తున్న అక్రమ మైనింగ్ ఫిర్యాదులపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు అలాగే రాయల్టీల ద్వారా జిల్లాకు వచ్చే ఆదాయాన్ని మరింత పెంచడంతో పాటు, జిల్లా మినరల్ ఫౌండేషన్ నిధులను ప్రజా ప్రయోజనాల కోసం సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. మత్స్య మరియు సహకార శాఖల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, అక్రమ కార్యకలాపాలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులతో అధికారులు సన్నిహితంగా వ్యవహరించడం పట్ల మండిపడుతూ, వికారాబాద్ జిల్లాలో అలాంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం ఉండకూడదని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఈ సమావేశంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహరా, దిశ కమిటీ సభ్యులు వడ్ల నందు, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, జానకిరామ్ నాయక్, అంటారం లలితతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.