నల్లగొండ: నాగార్జున కాలనీ 48వ కార్పొరేషన్ వార్డులో వైభవంగా గణనాథుని లడ్డు వేలం పాట: ₹76,116 రూపాయలకు దక్కించుకున్న గుండా రాంబాబు
నల్లగొండ మేజర్ న్యూస్ :
నల్లగొండ కేంద్రంలోని 48 వ వార్డు కార్పొరేషన్ పార్కులో ఏర్పాటు చేసిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా గణనాథుని మండపంలో నిర్వహించిన స్వామివారి లడ్డు వేలం పాట భక్తుల మధ్య ఎంతో ఉత్సాహభరితంగా సాగింది.విశేష ప్రజాదరణ పొందిన ఈ వేలం పాటలో పలువురు భక్తులు పోటీపడగా, చివరకు నల్లగొండ పట్టణానికి చెందిన గుండా రాంబాబు దంపతులు అత్యధికంగా రూ. 76,116 (డెబ్బై ఆరు వేల నూట పదహారు రూపాయలు) పలికి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. లడ్డును దక్కించుకున్న గుండా రాంబాబు కు ఉత్సవ కమిటీ సభ్యులు మరియు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చాడా కిషన్ రెడ్డి కార్పొరేటర్ యామ కవితా దయాకర్ నాగార్జున కాలనీ ప్రెసిడెంట్ నాంపల్లి మనోహర్ సూరం సోమిరెడ్డి పుట్టా కృష్ణ సుధాకర్ రెడ్డి గట్టు రాము తదితరులు శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో భక్తులు మరియు యువకులు పాల్గొన్నారు.