BREAKING
శశి థరూర్–మధుయాష్కీ గౌడ్ భేటీ ఎఐపిసి విస్తరణకు కార్యాచరణ రూపకల్పన సేవా రంగంలో అగ్రగామిగా నిలుస్తుంది - మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ పాకిస్తాన్‌లో ఘోర వైద్య నిర్లక్ష్యం: సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే డజన్ల కొద్దీ చిన్నారులకు హెచ్ఐవీ, న్యాయం కోసం బాధితుల పోరాటం నల్లగొండ: నాగార్జున కాలనీ 48వ కార్పొరేషన్ వార్డులో వైభవంగా గణనాథుని లడ్డు వేలం పాట: ₹76,116 రూపాయలకు దక్కించుకున్న గుండా రాంబాబు రైలు లో దొరికిన లాబ్ టాబ్, నగదు విలువైన పత్రాలను పోలీసులుకు అప్పగింత రబీ పంటల సాగుకు రైతులు సన్నద్దము కావాలి పల్లాను కలిసిన శివ నారాయణ చౌదరి కూలీలపై దూసుకెళ్లిన లారీ ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు విలక్షణ నటుడిగా సంచలనాలు సృష్టిస్తున్న రాఘవ్ జుయాల్! జీతాలు పెంచమంటే అక్రమంగా తొలగిస్తారా! వైర్‌లెస్ సెన్సార్ నెట్‌వర్క్‌ల పై పరిశోధనకు గీతం డాక్టరేట్ డ్రైవర్లకు ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ఇచ్చి ఆదుకోవాలి జి. వామనమూర్తి డిమాండ్. ఓటీటీలోకి వచ్చేసిన భయానక బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా.. సడన్‌గా స్ట్రీమింగ్‌ అవుతున్న వెంట్సర్‌! బద్వేల్ ఎస్ ఎల్ ఎన్ థియేటర్ పై చర్యలు తీసుకోవాలి.... టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. సుమలత కార్యవర్గం రద్దు!

కూలీలపై దూసుకెళ్లిన లారీ ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
కూలీలపై దూసుకెళ్లిన లారీ ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు

భూమయ్యగారిపల్లె క్రాస్ వద్ద ఘోర ప్రమాదం

కూలీలపై దూసుకెళ్లిన లారీ

- ఒకరు మృతి నలుగురికి తీవ్రగాయాలు

పులివెందుల మేజర్ న్యూస్:

కూలీలపై లారీ దూసుకు వెళ్లడంతో ఒక మహిళ మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం భూమయ్యగారిపల్లె స్పీడ్ బ్రేకర్ వద్ద లారీ అదుపుతప్పి పొలం పనులు చేస్తున్న కూలీలు వర్షం పడటంతో చెట్ల కిందికి వెళ్లి ఉండగా కడప నుంచి వస్తున్న లారీ స్పీడ్ బ్రేకర్ ని గమనించకపోవడంతో లారీ అదుపుతప్పి అక్కడే ఉన్న కూలీల పైకి దూసుకుని వెళ్ళింది. దాదాపు 18 మంది కూలీలు ఉండగా ఐదు మంది కూలీలకు గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ ద్వారా పులివెందుల లోని సర్వేజనా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేల్పుల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణమ్మ (52) మృతి చెందింది. గాయపడిన వారిలో తుమ్మలపాటి రమణమ్మ (44)పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంకటరమణ (58), లక్ష్మీదేవి (50), సుకన్య (32)లకు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేశారు. మెరుగైన చికిత్స కోసం గాయాలైన వారిని కడప రిమ్స్    తరలించినట్లు డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన వారిని పరామర్శించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

ప్రమాదం జరిగిన సంఘటన తెలుసుకున్న కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రాము వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ప్రమాదంలో మృతి చెందిన
లక్ష్మీనారాయణమ్మ
గాయపడిన వారిని పరామర్శిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి