రబీ పంటల సాగుకు రైతులు సన్నద్దము కావాలి
ముద్దనూరు మేజర్ న్యూస్:
మండల కేంద్రముఅయిన ముద్దనూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలి అన్నారు. అలాగే రైతులకు కావాల్సిన యూరియా మరియు డిఎపి ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కావాల్సిన రైతులు తీసుకోవాలని తెలిపారు.డిఎపి బస్తా ధర1350/-లు చెల్లించాలి అన్నారు. యూరియా 266.70 అని తెలిపారు.శనగ పంట సాగు చేసే రైతులకు విత్తనాలు కావాలి అని త్వరగా పంపిణీ చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము అన్నారు. తదుపరి గ్రామంలో సాగు చేసిన ప్రత్తి పంటను పరిశీలించి తగు సూచలు సలహాలు తెలియచేయడం జరిగింది అన్నారు. పురుగు మందులు వాడకం తగ్గించాలి అన్నారు.అవసరం మేరకే పిచికారీ చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు పి.కన్నా, గ్రామ రైతులు యమ్.వేణుగోపాల్ రెడ్డి,జగదేశ్వర రెడ్డి,నాగేశ్వర్ నాయిడు,శివ,మధు సుధన్,ఖదీర్ మరియు తదితర రైతులు పాల్గొన్నారు.