డ్రైవర్లకు ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ఇచ్చి ఆదుకోవాలి జి. వామనమూర్తి డిమాండ్.
సీతమ్మధార, సెప్టెంబర్ 23, మేజర్ న్యూస్ : ఉత్తర కోస్తాంధ్రలో తుఫాను కారణంగా ఆదాయం కోల్పోయిన ఆటోలు వ్యానులు జీపులు కార్లు లారీలు ఇతర మోటార్ వాహన డ్రైవర్లకు మోటార్ వాహనాల మెకానిక్లకునెల రోజులకు సరిపడా బియ్యము పప్పులు వంటనూనె వంటగ్యాసు చింతపండు సబ్బులు ఇతర నిత్యవసర వస్తువులు ఇచ్చి డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఎన్ ఎఫ్ ఐ ఆర్ టి డబ్ల్యూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తుఫాను కారణంగా ఆదాయం కోల్పోయిన డ్రైవర్ల ఇంటికి వాడే కరెంటు బిల్లులు ఇంటి పన్నులు పిల్లలు స్కూలు ఫీజులకు అత్యవసర వైద్యానికి ప్రభుత్వం రాయితీలు కల్పించి డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తుఫాను కారణంగా పాడైన అన్ని ప్రధాన రహదారులు గ్రామీణ వీధి రోడ్లను పక్కాగా వేసి వాహనాల మరమ్మత్తు నుండి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.