గణనాథుని లడ్డూకు రూ.1.88 లక్షల ధర
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూ వేలం పాటలో లడ్డూకు రూ.1,88,000 ధర పలికింది. వేలం పాటలో జగిత్యాల పట్టణానికి చెందిన వంగపెల్లి వేణుమాధవ్ రావు–రజని (బీర్పూర్) దంపతులు రూ.1.88 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మండపం వద్ద బుధవారం నిర్వహించిన ఈ వేలంపాటలో పెద్ద సంఖ్యలో పద్మ నాయక సంక్షేమ మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వేలంలో పాటలో గణనాథుని లడ్డును దక్కించుకున్న వేణుమాధవ్ రావు దంపతులను భక్తులు, నిర్వాహకులు అభినందించారు.