ముగతిపేటలో ఎమ్మెల్యే పర్యటన
ముగతిపేటలో ఎమ్మెల్యే పర్యటన
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
పట్టణంలోని ముగతిపేట 3వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్‌తో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న కేబుల్స్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తదితర మౌలిక వసతులను పరిశీలించారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో తాగునీటి కొరత లేకుండా రూ.157 కోట్లతో చేపడుతున్న కొత్త తాగునీటి పైప్‌లైన్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం వార్డు ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు.