స్టీల్, ఐరన్, గ్లాస్ అల్యూమినియం వృత్తిలో ఉన్న వారి జీవనోపాధిని కాపాడండి
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ :
ప్రొద్దుటూరులో స్టీల్ ఐరన్ గ్లాస్ అల్యూమినియం వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 10వేల మంది కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని ప్రొద్దుటూరు స్టీల్ ఐరన్ గ్లాస్ అల్యూమినియం అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే వరదలు కలిసి వారు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో స్టీల్ ఐరన్ గ్లాస్ మరియు అల్యూమినియం పనులు చేసుకుంటూ పదివేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అందులో వెల్డర్లు ట్విట్టర్లు గ్లాస్ కటింగ్ చేసేవారు అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ చేసేవారు హెల్పర్లు చిన్నచిన్న దుకాణాలు నడుపుకునే యజమానులు ఉన్నారని, ఈ కుటుంబాలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు తక్కువ రేటుకు పని చేస్తామని చెప్పి స్థానికంగా జీవనం కొనసాగిస్తున్న వారి పనులన్నీ చూసుకోవడంతో పనులు లేకుండా పోయాయని ఈ నేపథ్యంలో తమ జీవనోపాధికే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. దీనివల్ల వ్యాపారాలు రోజురోజుకు సన్నగిల్లడంతో నెలల తరబడి అని దొరకడం లేదని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. స్థానిక యజమానులు వర్కర్లు చాలామంది అద్దె గదులలో వ్యాపారాలు చేసుకుంటున్నారని పనులు సన్నగిల్లడంతో అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గదుల అద్దెలు కరెంట్ బిల్లులు వర్కర్ల జీతాలు భరించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యే వరద దృష్టికి తెచ్చారు. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోందని ఈ అప్పులు తీర్చలేక భవిష్యత్తులో ఆత్మహత్యల వరకు వెళ్లే పరిస్థితి వస్తుందేమోనన్న భయం మాలో నెలకొని ఉందని తెలిపారు. కావున మా పరిస్థితి అర్థం చేసుకొని మా ప్రధాన కోరికలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా స్థానికంగా ఉండే మా వృత్తిదారులకే ప్రాధాన్యత ఇచ్చేలా నియమాలు తీసుకురావాలని కోరారు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు భవన నిర్మాణ పనులలో స్థానికులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అక్రమంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా పని చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మాలాంటి చిన్న వృత్తిదారులకు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం మరియు సబ్సిడీలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాకు ప్రత్యేక షెడ్డు కాంప్లెక్స్ లేదా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి తక్కువ అద్దెలకు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నింటిపై తగు చర్యలు తీసుకుని 10 వేల కుటుంబాలకు అండగా నిలిచి మా జీవనోపాధిని కాపాడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఐరన్ గ్లాస్ అల్యూమినియం అసోసియేషన్ అధ్యక్షులు దస్తగిరి, కార్యదర్శి వలీ భాష, సభ్యులు కే విజయ్ కుమార్ ఎస్ షామీర్, వర్షాద్ అహ్మద్, ఎస్ వి శ్రీహరి, ఏ నాగ ప్రసాద్, వి థామస్, ఎస్ మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.