ఐదేళ్ల పదవీకాలం పూర్తి.. కృతజ్ఞతలు
చెన్నూరు మేజర్ న్యూస్:
చెన్నూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ నాయకులు,కార్యకర్తలు,మండల ప్రజలు, ఎంపీటీసీలు, సర్పంచులు,అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సురేష్ యాదవ్ పేర్కొన్నారు.