BREAKING
స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి వెదురూరులో సంకల్ప సేవా అభియాన్. నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌పై ఏసీబీ పంజా: భారీగా వెలుగులోకి వచ్చిన ఆస్తులు, తనిఖీల వివరాలు భవన నిర్మాణ పనులు పరిశీలించిన వైకాపా మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరావేద్దాం- నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌ రెడ్డి డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీ కెనడా పర్యటన: ఆతిథ్యమిచ్చేందుకు ఎదురుచూస్తున్నామన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఎర్రన్న కొట్టాలు పేరు మార్చడం తగదు మతాలు వేరైనా మనుషులు ఒక్కటే ఆధ్యాత్మిక, శాస్త్రీయ అద్భుతాల నిలయం.. చిదంబరం శ్రీ నటరాజ స్వామి ఆలయం ప్రత్యేకతలు రూపాయికి చాక్లెట్‌ కూడా రాదు.. విశాఖలో 99 పైసలకే భూములు ఇచ్చారు: జగన్‌ తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వీఆర్ఏల అర్ధనగ్న జల దీక్ష బయోచార్‌తో భూసార పరిరక్షణకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వైట్‌హౌస్ ఎదుట మూడో రోజూ నిలిచిన జర్నలిస్టులు: టెంట్లు మూసివేత, పాస్‌ల జప్తుపై సీఎన్‌ఎన్, పొలిటికో, ఎంఎస్ నౌ నిరసన అల్లు అర్జున్ రాకా మూవీపై క్రేజీ అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఐకాన్ స్టార్! ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం

స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్ :

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, క్యాడర్‌తో సమావేశం నిర్వహించి రాబోయే ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త తమకు సంబంధించిన ప్రాంతంలోని ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాలు తదితర వివరాలను పరిశీలించి ఏవైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వారి సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు చేరవేయాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజల వివరాలను తెలుసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా సహకరించాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని, గ్రామ, వార్డు స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.