BREAKING
నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరావేద్దాం- నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌ రెడ్డి డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీ కెనడా పర్యటన: ఆతిథ్యమిచ్చేందుకు ఎదురుచూస్తున్నామన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఎర్రన్న కొట్టాలు పేరు మార్చడం తగదు మతాలు వేరైనా మనుషులు ఒక్కటే ఆధ్యాత్మిక, శాస్త్రీయ అద్భుతాల నిలయం.. చిదంబరం శ్రీ నటరాజ స్వామి ఆలయం ప్రత్యేకతలు రూపాయికి చాక్లెట్‌ కూడా రాదు.. విశాఖలో 99 పైసలకే భూములు ఇచ్చారు: జగన్‌ తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వీఆర్ఏల అర్ధనగ్న జల దీక్ష బయోచార్‌తో భూసార పరిరక్షణకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వైట్‌హౌస్ ఎదుట మూడో రోజూ నిలిచిన జర్నలిస్టులు: టెంట్లు మూసివేత, పాస్‌ల జప్తుపై సీఎన్‌ఎన్, పొలిటికో, ఎంఎస్ నౌ నిరసన అల్లు అర్జున్ రాకా మూవీపై క్రేజీ అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఐకాన్ స్టార్! ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం గోవిందను పెళ్లి చేసుకున్నందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. సునీతా అహుజా సంచలన వ్యాఖ్యలు! విశాఖ మేయర్‌, కార్పొరేషన్‌ను హైజాక్‌ చేసిన తీరును ప్రజలకు చెప్పాలి: జగన్‌ బద్వేలు..ప్రహల్లాద రెడ్డి వ్యాఖ్యలు తగవు.. ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి.. సెప్టెంబర్‌ 27న సాధారణ కార్యకలాపాలు

బయోచార్‌తో భూసార పరిరక్షణకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
బయోచార్‌తో భూసార పరిరక్షణకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

-పంట అవశేషాలను సద్వినియోగం చేసుకుని రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి
-నంద్యాల జిల్లాలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుకు కార్యాచరణ నంద్యాల అర్బన్ : భూసార పరిరక్షణతో పాటు పంట అవశేషాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు బయోచార్ వినియోగాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు.  నంద్యాల జిల్లాలో ఈ తరహా కార్యక్రమాన్ని తొలిసారిగా చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆమె అధికారులను, సంబంధిత కోర్ టీమ్ సభ్యులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బయోచార్ వినియోగం, భూసార పరిరక్షణ, పంట అవశేషాల సద్వినియోగంపై సంబంధిత కోర్ టీమ్‌తో జిల్లా కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా బయోచార్ తయారీ విధానం, వ్యవసాయ భూముల్లో దాని వినియోగం, రైతులకు కలిగే ప్రయోజనాలపై సమగ్రంగా చర్చించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలు పెరిగే అవకాశం ఉన్నందున, వాటిని సద్వినియోగం చేసుకునే ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ‘కోంటికి’ (Kontiki) వంటి పరికరాలను ఉపయోగించి ఆక్సిజన్ పరిమిత పరిస్థితుల్లో పంట అవశేషాలను ప్రాసెస్ చేసి బయోచార్‌గా మార్చే విధానాన్ని పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. బయోచార్‌ను తగిన మోతాదులో సేంద్రియ ఎరువులతో కలిపి వ్యవసాయ భూముల్లో వినియోగించడం ద్వారా నేల నాణ్యత, సేంద్రియ పదార్థాల స్థాయిని మెరుగుపరిచే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. భూసార పరిరక్షణతో పాటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నంద్యాల జిల్లాలో తొలిసారిగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి, దాని ఫలితాలను శాస్త్రీయంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఫోర్ రెడ్డి ఫౌండేషన్, క్లైమిత్ర అండ్ సర్కులారిటీ బయో తరఫున జిల్లావ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు రూపొందించాల్సిన ప్రతిపాదనలను వారం రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ సూచించారు. కోర్ టీమ్ సభ్యులు అందించే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని, రాబోయే 3 నుంచి 6 నెలల్లో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాన్ని అమలు చేసి, దాని ఫలితాలను అంచనా వేయాలని కలెక్టర్ తెలిపారు. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. బయోచార్ నేలలో కార్బన్‌ను స్థిరీకరించడంతో పాటు దీర్ఘకాలికంగా నేల నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యం కలిగి ఉందని వివిధ అధ్యయనాలు సూచిస్తున్న నేపథ్యంలో, నంద్యాల జిల్లాలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా దీని వినియోగ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ప్రాజెక్టుగా కాకుండా పంట అవశేషాల నిర్వహణ, భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణను అనుసంధానించే సమగ్ర చర్యగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంబంధిత కంపెనీల ప్రతినిధులు రాజశేఖర్ రెడ్డి, అంకిత శర్మ, రవిచంద్ర,  నాబార్డ్ ఏజీఎం కార్తికేయ, ఎల్డియం అయ్యప్ప రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.