బద్వేలు..ప్రహల్లాద రెడ్డి వ్యాఖ్యలు తగవు..
బద్వేలు మేజర్ న్యూస్
కలసపాడు: ఏపీ.ఆర్.డీ.సీ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాజా రహమతుల్లాపై ప్రహల్లాద రెడ్డి ఏకవచన సంబోధన చేసిన వ్యాఖ్యలు తగవని కలస పాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జి. వెంకటరామిరెడ్డి అన్నారు.2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రహల్లాద రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయజ్యోతి మద్దతు తెలిపి, ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిం దేనని ఆయన పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తి నేడు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఖాజా రహమతుల్లా గురించి అసభ్యకరంగా మాట్లాడటం బాధాకరమని అన్నారు. టిడిపి పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి రంతుఅనిఆయనపేర్కొన్నారు.