రెవెన్యూ సేవలకు నేడు వీఆర్ఏలు సహాయ నిరాకరణ
బద్వేల్ మేజర్ న్యూస్
ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని బద్వేల్ మండలంలో మొదటిరోజు సహాయ నిరాకరణ ధర్నా కార్యక్రమం నిర్వహించినట్లు ఏపీ వీఆర్ఏ జేఏసీ సభ్యుడు గుర్రాల హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలముఖ్యమైన డిమాండ్లు తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా జీవో నెంబర్ 81 ప్రకారం మా వీఆర్ఏ సోదరులందరికీ నామినీలు ప్రమోషన్లు పే స్కేలు ఇవ్వాలిఅన్నారు. కొన్ని మండలాలలో అధికారులు మాపై ఒత్తిడితో బలవంతంగా పనులు చేయించుకుంటున్నారు అని వాచ్మెన్ అటెండర్ డ్రైవర్ టైపిస్టు రికార్డ్ అసిస్టెంట్ తదితర పనులన్నీ మా గ్రామ రెవెన్యూ సహాయకులతోచేయించు కోవడం పరిపాటిగా మారిందన్నారు.అదే పోస్ట్లులను వీఆర్ఏలకుఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు