దుర్గపు సుజాత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం
సూర్య శంకరపట్నం
తాడికల్ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు దుర్గపు సుజాత ఇటీవల మృతి చెందడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. తాడికల్‌లోని ఆమె నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు పార్టీ బలోపేతానికి సుజాత చేసిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆమె కుమారుడు, కుమార్తె చదువుల వివరాలను అడిగి తెలుసుకుని, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి తిరుపతి, సహకార సంఘాల చైర్మన్లు బసవయ్యగౌడ్, మహేష్, మత్స్య గిరీంద్రస్వామి ఆలయ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.