గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం
అమీన్‌పూర్: పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్ట కామన్ వద్ద నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే బ్యాంక్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమాన్ ప్రారంభోత్సవం, గణపతి మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎమ్మెల్యే కాట శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధ శ్రీనివాస్ గౌడ్తో కలిసి రామచంద్రాపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులు, స్థానిక ప్రజలకు అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని చాటుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.