పోలీస్ శాఖలో 11 వేల పోస్టులు ఖాళీగా ఉంటే 2050 పోస్టు విడుదల చేయడం దారుణం -ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగరాముడు
నంద్యాల అర్బన్ :పోలీస్ శాఖలో 11 వేల పోస్టులు ఖాళీగా ఉంటే 2050 పోస్టు విడుదల చేయడం ప్రభుత్వం కరెక్టు కాదని కావున తక్షణమే రీ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థులందరికీ ఉద్యోగాలు కల్పించడానికి తక్షణమే ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని వారు కోరారుఅదేవిధంగా
* అర్హులైన పోలీస్ శాఖలో అభ్యర్థుల వయో పరిమితిని 5 ఏళ్లకు పెంచాలి
పోలీసులకు పని భారం తగ్గించాలని వాటికి ప్రభుత్వం కృషి చేయాలని వారు తెలిపారు అయితే సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో ఫీజులు ఖర్చు ఉద్యోగం తమ జీవితం లక్ష్యంగా భావించి యువత నోటిఫికేషన్ ఎదురుచూస్తున్న తరుణంలో వారి ఆశలను నిరుస్తాహపరుస్తూ 2050 పోస్టులు వదలడం సమంజసంగా లేదని కావున నిరుద్యోగ యువత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి కలలు కన్నా నిరుద్యోగ యువతకు ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలవాలని పోలీసు వ్యవస్థ అనేది ప్రభుత్వ నడిపే దానికి బలమైన సమస్త కనుక లా అండ్ వ్యవస్థ బాగుండాలంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న పోలీస్ వ్యవస్థ ముఖ్యంకానుక తక్షణమే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి వాటితో పాటుగా ఈ పోస్టులకుఅర్హులైన నిరుద్యోగులకు వయోపరిమితిని ఐదు సంవత్సరాలు పెంచాలని అదేవిధంగా జరిగిన అవుకుతావకలపై విచారణ చేపట్టాలని అదేవిధంగా వీఆర్ఏల న్యాయపరమైన దీక్షలు అర్థం చేసుకొని ప్రభుత్వం న్యాయం చేయాలనినిరుద్యోగ వ్యవస్థకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలని లేని పక్షాన ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలిసొచ్చి నిరుద్యోగులు అందర్నీ కలుపుకొనీ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అదేవిధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందుగానే పెండింగ్లో ఉన్న పోలీసు నోటిఫికేషన్లను విడుదల చేయాలని లేని పక్షంలో కలిసిచ్చే నిరుద్యోగుల కలుపుకొని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలను కూడా చేపడతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రణత్ యాదవ్, పృథ్వి కుమార్, హరి, రజాక్,ఉదయ్ , మంజునాథ్ తదితరులు పాల్గొనడం జరిగింది