BREAKING
గాజాలోని బురెయిజ్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దళాల కాల్పులు: పాలస్తీనా మహిళ దుర్మరణం బెంగళూరు–విజయవాడ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం మిజోరంలో అస్సాం రెజిమెంట్ జవాన్ హత్య కేసు: మహిళ సహా ఆరుగురు నిందితుల అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు ఫహద్ ఫాసిల్ 'డాంట్ ట్రబుల్ ది ట్రబుల్' ట్రైలర్ రిలీజ్: అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంతో వస్తోన్న మ్యాజికల్ రైడ్! వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి గ్రానైట్ బ్యారన్ పోక్సో కేసులో కీలక పరిణామం.. నటి ఖుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర వరదలు, ఎండలు: నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు, ప్రభుత్వానికి హెచ్చరిక థాంగ్‌-టా(మార్ష‌ల్ ఆర్ట్స్‌) క్రీడాకారిణికి పూడూరి జితేంద‌ర్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్ హెచ్చరికలు వ్యూహాత్మక నిరాశకు నిదర్శనం: తేల్చిచెప్పిన టెహ్రాన్ కలసపాడు ఎస్ఐగా హనుమంతు బాధ్యతలు స్వీకరణ రేజింతల్‌లో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కి గ్రామస్థుల వినతి. దిల్లీలో దారుణం: ప్రసిద్ధ కాలికాజీ ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ శాకాంబరీశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి గణపతి వైభవంగా వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు 'టోరతి' చిత్ర విశేషాలు: ఇళయరాజా ఇచ్చిన సలహాపై నటుడు సనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు

సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా

Select Suryaa Now
సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా

-ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్*

-ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్య విజ్ఞానంలో ముఖ్యమైన భాగo

-ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-ప్రతి ఒక్కరు ఒత్తిడిని జయించి విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి : జిల్లా ఆయుష్ అధికారి యశోద

నంద్యాల అర్బన్ : ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోనే పి జి ఆర్ ఎస్ హాలు నందు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం బుధవారం జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ HB, bone density వంటి తదితర టెస్టులు చేయించుకున్న అనంతరం వైద్యుల జిల్లా కలెక్టర్ కు  మందులు అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుర్వేదం, ఆయుష్ వైద్య విధానాల ప్రాధాన్యతను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లైఫ్ సైన్స్ విద్యార్థిగా డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న సమయంలో బోటనీ, మెడిసిన్ తదితర సబ్జెక్టుల ద్వారా ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, యునాని, సిద్ధ వంటి వివిధ వైద్య విధానాల గురించి తెలుసుకున్నానని తెలిపారు. ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్య విజ్ఞానంలో ముఖ్యమైన భాగమని తెలిపారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఉద్యోగులు ఎక్కువ సమయం కార్యాలయాల్లో కూర్చుని పనిచేయడం, సుదీర్ఘ గంటల పాటు పనిచేయడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, రాత్రి వేళల్లో ఎక్కువసేపు మేల్కొని ఉండటం వంటి అలవాట్ల వల్ల నడుము నొప్పి, డిస్క్ సంబంధిత సమస్యలు, జుట్టు రాలడం, గొంతు సమస్యలు తదితర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. 
తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, నడుము మరియు డిస్క్ సంబంధిత సమస్యల ఉపశమనానికి డాక్టర్ యశోధర సూచించిన కర్పూర తైలం ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందినట్లు తెలిపారు. అలాగే నిద్రకు సంబంధించిన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యల విషయంలో ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు అశ్వగంధ చూర్ణం ఉపయోగించారని తెలిపారు.పసుపు, ఉసిరి వంటి సహజ పదార్థాలకు ఆయుర్వేదంలో ఉన్న ప్రాధాన్యతను జిల్లా కలెక్టర్ వివరించారు. గొంతు సంబంధిత సమస్యలకు సీతోఫలాది చూర్ణం వంటి ఆయుర్వేద ఔషధాలను వైద్యుల సలహాతో వినియోగించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే స్వయంగా టాబ్లెట్లు తీసుకోవడం, అవసరం లేకపోయినా అధిక మొత్తంలో మందులు కొనుగోలు చేసి సగం ఉపయోగించి వృథా చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించి, అవసరమైన చికిత్స మేరకు మాత్రమే తీసుకోవాలని తెలిపారు.ఆయుర్వేదం సహా వివిధ వైద్య విధానాలను వైద్యుల సూచనల మేరకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజలు కుటుంబ సమేతంగా ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యుల సలహాలు, అవసరమైన ఔషధాలను ఉచితంగా పొంది శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ధన్వంతరి యంత్ర చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జిల్లా ఆయుష్ అధికారి మాట్లాడుతూ..వయస్సు పెరుగుతున్న కొద్దీ జీవనశైలి, ఒత్తిడి, హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా ఎముకల సాంద్రత తగ్గే అవకాశం ఉంటుందని, నడుము, మెడ, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వయస్సునునియంత్రించలేక పోయినా, సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. 
ప్రాచీన ఆయుర్వేదంలో ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఆహారంతో పాటు సామాజిక ప్రవర్తన, ఒత్తిడి లేని జీవనం, పెద్దల సలహాలను పాటించడం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో అవసరమని అన్నారు. 
ప్రతి పనిని ఇష్టపడి, సానుకూల దృక్పథంతో స్వీకరించినప్పుడు మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఒత్తిడిని నియంత్రించుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలన్నారు.
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమానికి వచ్చే వారిలో  నడుము,మెడ, మోకాళ్ల వంటి కీళ్ల నొప్పులు, మధుమేహ సమస్యలతో వస్తున్నట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైందని తెలిపారు. ఆయుర్వేద వైద్య విధానంలో ఆరోగ్య పరిరక్షణకు, వ్యక్తి శారీరక పరిస్థితికి అనుగుణంగా చికిత్సా విధానాలను అనుసరిస్తారని వైద్యులు నొప్పులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు స్వయంగా మందులు వినియోగించకుండా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స పొందాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో ఆయుర్వేదంలో వినియోగించే ప్రత్యేక తైలాలు, ఇతర చికిత్సా విధానాలను వైద్యుల సలహాతో మాత్రమే ఉపయోగించుకోవాలని తెలిపారు. ఉచిత వైద్య శిబిరం నందు నాడీ పరీక్ష , Bone Mineral Density, HB తదితర టెస్టులు చేయించుకున్న వారిని వైద్యుల సలహా మేరకు ప్రతి ఒక్కరికి  మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆయుర్వేద, హోమియో వైద్యులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.