BREAKING
గాజాలోని బురెయిజ్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దళాల కాల్పులు: పాలస్తీనా మహిళ దుర్మరణం బెంగళూరు–విజయవాడ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం మిజోరంలో అస్సాం రెజిమెంట్ జవాన్ హత్య కేసు: మహిళ సహా ఆరుగురు నిందితుల అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు ఫహద్ ఫాసిల్ 'డాంట్ ట్రబుల్ ది ట్రబుల్' ట్రైలర్ రిలీజ్: అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంతో వస్తోన్న మ్యాజికల్ రైడ్! వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి గ్రానైట్ బ్యారన్ పోక్సో కేసులో కీలక పరిణామం.. నటి ఖుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర వరదలు, ఎండలు: నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు, ప్రభుత్వానికి హెచ్చరిక థాంగ్‌-టా(మార్ష‌ల్ ఆర్ట్స్‌) క్రీడాకారిణికి పూడూరి జితేంద‌ర్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్ హెచ్చరికలు వ్యూహాత్మక నిరాశకు నిదర్శనం: తేల్చిచెప్పిన టెహ్రాన్ కలసపాడు ఎస్ఐగా హనుమంతు బాధ్యతలు స్వీకరణ రేజింతల్‌లో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కి గ్రామస్థుల వినతి. దిల్లీలో దారుణం: ప్రసిద్ధ కాలికాజీ ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్ శాకాంబరీశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి గణపతి వైభవంగా వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు 'టోరతి' చిత్ర విశేషాలు: ఇళయరాజా ఇచ్చిన సలహాపై నటుడు సనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు

థాంగ్‌-టా(మార్ష‌ల్ ఆర్ట్స్‌) క్రీడాకారిణికి పూడూరి జితేంద‌ర్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం

Select Suryaa Now
థాంగ్‌-టా(మార్ష‌ల్ ఆర్ట్స్‌) క్రీడాకారిణికి పూడూరి జితేంద‌ర్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం

ఉప్ప‌ల్ డివిజ‌న్‌లోని శాంతిన‌గ‌ర్‌కు చెందిన ఇంట‌ర్ విద్యార్థిని వేద‌శ్రీ 32వ జాతీయ థాంగ్‌-టా(మార్ష‌ల్ ఆర్ట్స్‌) ఛాంపియ‌న్‌షిప్‌కు ఎంపికవ కావటంతో జ‌మ్ముశ్మీర్‌లో ఈ నెల 25 నుంచి అక్టోబ‌ర్ 4 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న పోటీల్లో అండ‌ర్ 52 కేజీ విభాగంలో ఆమె పాల్గొన‌నుంది. అయితే, జ‌మ్ము క‌శ్మీర్‌కు వెళ్లి పోటీల్లో పాల్గొన‌డం ఖ‌ర్చుతో కూడిన‌ది కావ‌డంతో విద్యార్థిని కుటుంబం ఉప్ప‌ల్ బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పూడూరి జితేంద‌ర్‌రెడ్డి(ఉప్ప‌ల్ పీజేఆర్‌)ను సంప్ర‌దించింది. వెంట‌నే స్పందించిన జితేంద‌ర్‌రెడ్డి రూ.15 వేలు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఈ డ‌బ్బుల‌ను బుధ‌వారం ఉప్ప‌ల్ ఎమ్మెల్యే బండారి ల‌క్ష్మారెడ్డి చేతుల‌మీదుగా వేద‌శ్రీ కుటుంబానికి అందించారు. పోటీల్లో స‌త్తాచాటాల‌ని, ఉప్ప‌ల్‌కు మంచి పేరు తీసుకురావాల‌ని  క్రీడలతోనే గుర్తింపు తో పాటు భవిష్యత్తు ఉంటుందని. దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించివచ్చని ఎమ్మెల్యే అన్నారు. క్రీడల అభివృద్ధికి తాము ఎంతగానో కృషి చేస్తున్నామని, ఎవరికి ఎలాంటి అవకాశాలున్న అందుకుచ్చుకోవడానికి తను వంతు సాయం చేస్తానని అన్నారు. కేవలం చదువు పట్లే కాకుండా క్రీడలు పట్ల విద్యార్థులు యువత ఆసక్తి చూపాలని అప్పుడే మన సత్తా ప్రపంచానికి తెలియజేయవచ్చని ఆయన హితవు పలికారు