బెంగళూరు–విజయవాడ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
కృష్ణా: బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమైన విమానాన్ని పైలెట్లు అప్రమత్తంగా తిరిగి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికుల్లో కొంత ఆందోళన నెలకొంది.
ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. సాంకేతిక సమస్యను గుర్తించిన అనంతరం పైలెట్లు విమానాన్ని వెనక్కి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
విమానంలో తలెత్తిన సాంకేతిక లోపానికి కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం తదుపరి ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.