విశాఖ నుంచి జనసేన మేయర్ ను కానుకగా పవన్ కళ్యాణ్ కు అందిద్దాం
*కూటమి కోసం విశాఖలో జనసేన ఎన్నో త్యాగాలు చేసింది*
*గతంలో ఎంపీ,మేయర్, విఎంఆర్డిఏ చైర్మన్ వంటివన్నీ వదులుకున్నాం*
*వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వేలకోట్ల భూకుంభకోణాలు ఆపింది జనసేన*
*వైసీపీ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులతో జైలుకు వెళ్ళింది కూడా ఉమ్మడి విశాఖ జనసేన నేతలే*
*చంద్రబాబు అరెస్టు సమయంలో చేపట్టిన ఉద్యమంలో కూడా జనసేన ముందుంది*
*ప్రజాబలం జనసైనికుల కష్టంతో జనసేనాని పిలుపు తో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగింద్దాం*
*స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయం వైపు అడుగు...జనసేన అధినేత గా దిశా నిర్దేశపు వెలుగు*
*జనసేన నేత పీతల మూర్తి యాదవ్*
విశాఖపట్నం, సెప్టెంబర్ 23:-
రాష్ట్రంలో కీలకమైన మహా విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ మేయర్ గా జనసేన అభ్యర్థిని గెలిపించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కానుకగా ఇవ్వాలని పార్టీ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు. జనసేన విశాఖలో అత్యంత బలంగా ఉందని గత వైసిపి ప్రభుత్వం లో ఆ ప్రభుత్వం చేపట్టిన అవినీతి అక్రమాలు భూకబ్జాలకు వ్యతిరేకంగా అన్ని రకాల పోరాటాలు చేసి ప్రజల మద్దతును కూడగట్టిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దానికి ఫలితంగా రానున్న ఎన్నికల్లో మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిని గెలిపించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా ఉత్తరాంధ్రలో సుస్థిర స్థానం సంపాదించాలని పేర్కొన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు శాసనసభ్యులు ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ పార్టీని బలోపేతం చేశారని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థకు గతంలో జరిగిన ఎన్నికల్లో జనసేన ద్వారా ఎన్నికైన ముగ్గురు కార్పొరేటర్లు కౌన్సిల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు బీజం వేశారని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరపాలక సంస్థ మేయర్ సీటు జనసేనకు కేటాయించటం కూటమి ధర్మమని తెలిపారు.
*పవన్ కళ్యాణ్ నిర్ణయం అద్భుతం*
మంగళవారం కాకినాడలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బోలోపేతం చేసే దిశగా తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని మూర్తి యాదవ్ కొనియాడారు. జనసేన బలం ఉన్న ప్రతి చోట పోటీ చేయాలని అవసరమైతే కూటమి పక్షాలతో స్నేహపూర్వక పోటీకైనా సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటం పార్టీ కేడర్ను ఎంతగానో ఉత్సాహపరిచిందని పేర్కొన్నారు. 14 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న కేడర్ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనతో క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ బాటలో పయనించేందుకు విశాఖ జనసేన నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
*వైసీపీ పాలనలో పోరాటాలు చేసింది, జైలుకు వెళ్ళింది జనసేన నేతలే*
వైయస్సార్ కాంగ్రెస్ రాక్షస పాలనలో విశాఖలో మిగిలిన మిత్రపక్షాల కంటే ఎక్కువగా పోరాటాలు చేసింది చివరకు జైలకు కూడా వెళ్ళింది జనసేన నేతలేనని మూర్తి యాదవ్ గుర్తు చేశారు. విశాఖ విమానాశ్రయంలో అప్పటి మంత్రి రోజా ను అడ్డుకున్నామని అక్రమ కేసులో నాతోపాటు ప్రస్తుత ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ తో పాటు పలువురు నేతలు విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. విశాఖలో వైసీపీపాలనా కాలంలో అక్రమంగా నిర్మించిన జగన్ ఋషికొండ ప్యాలెస్ కు వ్యతిరేకంగా జనసేన పోరాటం చేసి హైకోర్టుకు వెళ్లి నిర్మాణాన్ని ఆపించిందని, సిరిపురం సి.బి.సి.ఎన్.సి స్థలంలో అప్పటి ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ ప్రారంభించిన అక్రమ కట్టడానికి జనసేన బ్రేకులు వేసిందని గుర్తు చేశారు. ఈ రెండు స్థలాలను పవన్ కళ్యాణ్ స్వయంగా సందర్శించి పరిశీలించి ఉద్యమానికి సూచనలు సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. భీమిలిలో ఎర్రమట్టి దెబ్బలు ఆక్రమణకు గురికాకుండా పవన్ కళ్యాణ్ స్వయంగా సందర్శించి ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
*కీలకమైన పదవులు ఏవీ జనసేనకు రాలేదు*
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖకు సంబంధించిన కీలకమైన పదవులేవి జనసేనకు దక్కలేదని మూర్తి యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నలుగురు శాసనసభ్యులు జనసేన నుంచి ఎంపికైనప్పటికీ మంత్రి పదవుల్లో గాని కీలకమైన నామినేటెడ్ పదవుల్లో గాని ప్రాతనిధ్యం ఈ పార్టీకి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ నగరానికి సంబంధించి మేయర్, విఎమ్ఆర్డిఏ చైర్మన్ , ఎమ్మెల్సీ వంటివి తెలుగుదేశం పార్టీ తీసుకుందని తెలిపారు. విశాఖకు సంబంధించి కీలకమైన అధికారుల పోస్టింగులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ ల నియామకాలలో కూడా జనసేనకు అన్యాయమే జరిగిందని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో విశాఖ మేయర్ గా జనసేన అభ్యర్థిని నిలిపి అఖండ మెజారిటీతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.