BREAKING
పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసిన శృతి హాసన్.. ఆ పెళ్లికి చాలా దగ్గరగా వెళ్లి ఆగిపోయా! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం తక్కల్లపల్లిలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం. ఉచిత బస్సుల్లో మహాలక్ష్మి లు ఆల్ టైం రికార్డ్ రెవెన్యూ సేవలకు నేడు వీఆర్ఏలు సహాయ నిరాకరణ విశాఖ నుంచి జనసేన మేయర్ ను కానుకగా పవన్ కళ్యాణ్ కు అందిద్దాం స్వచ్ఛతే మన బాధ్యత పరిశుభ్రతే మన భవిష్యత్తు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం పోలీస్ శాఖలో 11 వేల పోస్టులు ఖాళీగా ఉంటే 2050 పోస్టు విడుదల చేయడం దారుణం -ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగరాముడు దుర్గపు సుజాత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం అహ్మదాబాద్‌కు రేపు మంత్రి నారా లోకేష్ గాజాలోని బురెయిజ్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దళాల కాల్పులు: పాలస్తీనా మహిళ దుర్మరణం బెంగళూరు–విజయవాడ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం మిజోరంలో అస్సాం రెజిమెంట్ జవాన్ హత్య కేసు: మహిళ సహా ఆరుగురు నిందితుల అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు ఫహద్ ఫాసిల్ 'డాంట్ ట్రబుల్ ది ట్రబుల్' ట్రైలర్ రిలీజ్: అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంతో వస్తోన్న మ్యాజికల్ రైడ్!

ఉచిత బస్సుల్లో మహాలక్ష్మి లు ఆల్ టైం రికార్డ్

Select Suryaa Now
ఉచిత బస్సుల్లో మహాలక్ష్మి లు ఆల్ టైం రికార్డ్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌
మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహాలక్ష్మి పథకం 


 రోజుకు 37 లక్షల మందికి పైగా ప్రయాణిస్తూ ఆల్ టైమ్ రికార్డ్!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన మహాలక్ష్మి పథకం అద్భుతంగా ముందుకు సాగుతుందని, మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో అన్ని జోన్ల ఈడీలు, ఆర్ఎంలతో జరిగిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్  నాగిరెడ్డి అన్నారు. ప్రారంభంలో రోజుకు 29.42 లక్షల ప్రయాణాల నుండి నేడు 37.09 లక్షల ప్రయాణాలకు... మహిళలకు అడుగడుగునా అండగా నిలుస్తుందని, మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు చేస్తున్న EDలు, RMలు, DMలు, డ్రైవ‌ర్లు, కండ‌క్టర్లు మ‌రియు క్షేత్రస్థాయి సిబ్బందికి ఎండీ  ప్రశంసలు కురిపించారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు, సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబర్ 9న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిందని. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ మరియు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపిందని ఆయన తెలిపారు. నిత్యం పనుల కోసం, చదువుల కోసం, కుటుంబ అవసరాల కోసం పయనించే మహిళలకు ఇది ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తూ, వారిని నిజమైన మహారాణులుగా మార్చిందని ఈ పథకం ద్వారా రోజుకు 37 లక్షల మందికి పైగా ప్రయాణిస్తూ ఆల్ టైమ్ రికార్డు సృష్టించడమే కాకుండా, మహిళల సాధికారతకు అడుగడుగునా అండగా నిలుస్తోందని
పథకం ప్రారంభమైన మొదటి రోజు నుంచే మహిళల నుంచి అపూర్వ స్పందన లభించిందని ఆయన తెలిపారు.
ఈ బృహత్తర విజయం వెనుక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  అధికారుల మరియు క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర కృషి ఉంది అని ఆయన అన్నారు. . ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న ఈడీలు సిహెచ్. వెంకన్న, ఎం. రాజశేఖర్, సాలోమన్, ఖుష్రో షా ఖాన్, ఏ. శ్రీధర్, ఎఫ్ఏ విజయపుష్పలతో పాటు అన్ని రీజియన్ల ఆర్ఎంలను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
మహాలక్ష్మి స్కీమ్ వల్ల బస్ సర్వీసులు తగ్గించారంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.