తక్కల్లపల్లిలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం.
భయభ్రాంతులకు గురైన ప్రజలు.
సూర్య మల్యాల :
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ప్రాథమిక పాఠశాల కు సమీపంలో ఉన్న సిసి రోడ్డుపై ఒక్కసారిగా భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు గమనించి భారీ కొండచిలువను చంపి వేశారు. ఈ కొండచిలువ 13 ఫీట్లు పొడవు ఉంది. సాధారణంగా ఈ భారీ కొండచిలువలు గుట్టలు ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఉంటాయి. కానీ ఏకంగా గ్రామంలో జన సంచారం ఉన్న ప్రాంతంలోనే సిసి రోడ్డుపైన ప్రత్యక్షమవడం గమనార్హం. భారీ కొండచిలువ సిసి రోడ్డుపైన ప్రత్యక్షమవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు