కాళేశ్వరం కట్టింది.. కూల్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే: ఉత్తమ్
*దేవాదుల నీటిని తుంగతుర్తికి తెచ్చేందుకు కృషి.. రెండేళ్లలో పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు అందించాం
తుంగతుర్తి: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది, దాన్ని కూల్చింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తుంగతుర్తి ప్రాంతానికి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు నీటిని తుంగతుర్తికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పేదల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని ఉత్తమ్ తెలిపారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించామని, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు.
తుంగతుర్తి నుంచి పోటీ చేయను
ఒకవేళ జనరల గ మారిత తాన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం తన వంతు కృషి కొనసాగుతుందని చెప్పారు. తుంగతుర్తి పరిధిలోని తాటిపాముల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి తుంగతుర్తి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.