ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి భరోసా
161 మంది లబ్ధిదారులకు రూ.44.15 లక్షల ఆర్థిక సాయం
సూర్య,భీమ్‌గల్:
అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.మండలంలోని వివిధ గ్రామాలు, భీమ్‌గల్ పట్టణానికి చెందిన మొత్తం 161 మంది లబ్ధిదారులకు రూ.44.15 లక్షల మేర ఆర్థిక సహాయం మంజూరైనట్లు మల్లెల లక్ష్మణ్ వెల్లడించారు. ఆసుపత్రి చికిత్సకు అయ్యే ఖర్చులను భరించలేని పేద కుటుంబాలకు ఈ సహాయం కొంత ఆర్థిక ఊరట కల్పిస్తుందని తెలిపారు.లబ్ధిదారుల వివరాల ప్రకారం భీమ్‌గల్ టౌన్‌లో 30 మందికి రూ.9,48,500, పూరాణిపేట్‌లో 12 మందికి రూ.2,95,000, బెజ్జోరాలో 8 మందికి రూ.2,03,000, బాచన్‌పల్లిలో 4 మందికి రూ.68,000, ముచ్కూర్‌లో 14 మందికి రూ.3,55,500, లింగాపూర్‌లో ఇద్దరికి రూ.50,000, పిప్రిలో ఏడుగురికి రూ.2,10,000, పల్లికొండలో ఏడుగురికి రూ.2,21,000 మంజూరైనట్లు తెలిపారు.చేంగల్‌లో 19 మందికి రూ.3,95,500, సికింద్రాపూర్‌లో ఐదుగురికి రూ.1,41,500, బాబాపూర్‌లో ముగ్గురికి రూ.86,000, కుప్కల్‌లో ఆరుగురికి రూ.2,18,500, జాగీర్యాల్‌లో నలుగురికి రూ.1,09,000, బాబానగర్‌లో ముగ్గురికి రూ.60,000, మెండోరలో 11 మందికి రూ.2,73,000, కారేపల్లిలో ఇద్దరికి రూ.33,000, తాళ్లపల్లిలో ఒకరికి రూ.38,500, రహత్‌నగర్‌లో నలుగురికి రూ.80,500, రూప్లా తండాలో ఒకరికి రూ.18,000, బడా భీంగల్‌లో 10 మందికి రూ.3,61,000, గోన్‌గొప్పులలో ఎనిమిది మందికి రూ.2,50,000 ఆర్థిక సహాయం అందినట్లు వివరించారు.నిరుపేద కుటుంబాలు తీవ్రమైన అనారోగ్య సమయంలో ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు దూరం కాకుండా ప్రభుత్వ సహాయ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మల్లెల లక్ష్మణ్ సూచించారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం అందేలా స్థానికంగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు.