BREAKING
తాడేపల్లిలో వైయస్‌ జగన్‌ను కలిసిన భీమిలి అసెంబ్లీ సమన్వయకర్త బొత్స అనూష: పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు గౌడవల్లిలో డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ జనరల్ అనస్థీషియాతో బ్రెయిన్ మైండ్ సీక్రెట్స్ ప్రపంచ రాజకీయంలో ఊహించని మార్పులు వర్షాభావ మరాఠ్వాడా ప్రాంతాల్లో ఫడ్నవీస్ పర్యటన: నీటి సమస్యకు ఎంవీఏ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం భారీ వర్షాల హెచ్చరిక కేటమైన్ డ్రగ్ వాడకంతో తీవ్ర ముప్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర కలకలం: భార్య, ఇద్దరు పూజారులను కాల్చిచంపి.. పిల్లలను బందీగా చేసుకున్న నిందితుడు ఎన్‌కౌంటర్ 'ది పారడైజ్' ప్రీమియర్‌కు నాని అనుమతి కోరిక: స్థానిక పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన వికలాంగత ఎదుగుదలకు అడ్డుకాదు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కలకలం: నేడు రాత్రికి విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు: ఏపీ హైకోర్టు విచారణపై స్టే, డీజీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ వ్యాఖ్యల కలకలం వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతి అభివృద్ధికి భారీ నిధులు

వికలాంగత ఎదుగుదలకు అడ్డుకాదు

Select Suryaa Now
వికలాంగత ఎదుగుదలకు అడ్డుకాదు

పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి మేజర్  న్యూస్ (సెప్టెంబర్ 23 ):శారీరక లోపం ఎదుగుదలకు ఏమాత్రం అడ్డుకాదని, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.బుధవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వికలత్వ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరం శిబిరానికి వచ్చే దివ్యాంగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.సెర్ప్ ద్వారా రూ.10 లక్షల నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా సదరం శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వికలత్వ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చే వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సదరం సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, అవసరాలు, సిబ్బంది వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.