గణనాథుడి లడ్డూకు రికార్డు ధర.. రూ.6.11 లక్షలకు వేలం
వరుసగా రెండోసారి దక్కించుకున్న సంతోష్
మేడ్చల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 23):
గణేశ్ నవరాత్రుల సందర్భంగా గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని బెన్సప్ ఇన్‌ఫ్రా సురక్ష అపార్ట్‌మెంట్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడి లడ్డూ వేలం భక్తిశ్రద్ధల మధ్య ఉత్సాహంగా జరిగింది. లడ్డూను రూ.6.11 లక్షలకు సంతోష్ దక్కించుకుని రికార్డు ధర పలికించారు.గతంలోనూ లడ్డూను దక్కించుకున్న సంతోష్.. వరుసగా రెండోసారి గణనాథుడి లడ్డూను వేలంలో సొంతం చేసుకోవడం విశేషంగా నిలిచింది. వేలం కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ వాసులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.అనంతరం వేలంలో లడ్డూను దక్కించుకున్న సంతోష్‌కు మేడ్చల్ మాజీ జడ్పీటీసీ, 299 డివిజన్ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, అపార్ట్‌మెంట్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.