BREAKING
పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే కీలకం: హోంమంత్రి వంగలపూడి అనిత ఘనంగా యంగ్ హీరో ప్రిన్స్ వివాహ రిసెప్షన్.. హాజరైన టాలీవుడ్ ప్రముఖులు జెడ్పీ పాలకవర్గ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు అభివృద్ధికి అధిక ప్రాధాన్యం 10th class విద్యార్థికి లక్ష బహుమతి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన నాని ప్యారడైజ్ ప్రీమియర్ షోకు పోలీసుల నో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భద్రతా కారణాల రీత్యా తిరస్కరణ రీ సర్వే పేరుతో భూమి కుదింపు.. రైతు ఆవేదన దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,, మాజీ mla ల బృందం.. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌కు ఘన సన్మానం. ఫేమస్ కాకముందే ఎక్కువ సంపాదించేదాన్ని.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న కుమారి ఆంటీ స్కూల్ గేమ్స్ ప్రారంభం మదాఓఎలా యురేనియం ప్రాజెక్ట్‌లో వాటాను 40 శాతానికి పెంచుకున్న నైజర్ ప్రభుత్వం ఇంధన ధరలు పెరిగితే వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారమే భావోద్వేగాల ప్రవాహం.. కంటతడి పెట్టించిన పదహారవ ఎపిసోడ్

రాజమహేంద్రవరంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Select Suryaa Now
రాజమహేంద్రవరంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

అక్రమ నిర్మాణం కూల్చివేత* 

రాజమహేంద్రవరం లో అనధికార నిర్మాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్థానిక సాయిదుర్గానగర్లో నగరపాలక సంస్థ నుండి అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాన్ని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించారు. నిర్దేశిత అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారు స్వచ్చందంగా తొలగించుకోకుంటే నగరపాలక సిబ్బందే పూర్తిగా తొలగిస్తారని కమిషనర్ రాహుల్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఇకపై అనధికార నిర్మాణాలు, హోర్డింగ్స్ తొలగింపు కొనసాగుతుందని.. అవసరమైతే అదనపు జేసిబీలు, సిబ్బందిని సమకూర్చుకోవాలని సిటీ ప్లానర్ ను ఆదేశించడం జరిగిందన్నారు. అలాగే వార్డు సచివాలయాల వారీగా అనధికార నిర్మాణాలు, హోర్డింగ్స్ లను ఇప్పటికే గుర్తించామని, వాటన్నింటినీ షెడ్యూల్ ప్రకారం తొలగిస్తామని స్పష్టం చేశారు. కావున భవన నిర్మాణాల సమయంలో తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని.. సదరు అనుమతులు పొంది, నగర ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే టింబర్ యార్డు రోడ్డులో రహదారి పైకి వచ్చిన ర్యాంపులు, ప్లాట్ ఫామ్ లను బుధవారం పట్టణ ప్రణాళిక విభాగం తొలగించడం జరిగింది.