BREAKING
పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే కీలకం: హోంమంత్రి వంగలపూడి అనిత ఘనంగా యంగ్ హీరో ప్రిన్స్ వివాహ రిసెప్షన్.. హాజరైన టాలీవుడ్ ప్రముఖులు జెడ్పీ పాలకవర్గ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు అభివృద్ధికి అధిక ప్రాధాన్యం 10th class విద్యార్థికి లక్ష బహుమతి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన నాని ప్యారడైజ్ ప్రీమియర్ షోకు పోలీసుల నో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భద్రతా కారణాల రీత్యా తిరస్కరణ రీ సర్వే పేరుతో భూమి కుదింపు.. రైతు ఆవేదన దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,, మాజీ mla ల బృందం.. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌కు ఘన సన్మానం. ఫేమస్ కాకముందే ఎక్కువ సంపాదించేదాన్ని.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న కుమారి ఆంటీ స్కూల్ గేమ్స్ ప్రారంభం మదాఓఎలా యురేనియం ప్రాజెక్ట్‌లో వాటాను 40 శాతానికి పెంచుకున్న నైజర్ ప్రభుత్వం ఇంధన ధరలు పెరిగితే వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారమే భావోద్వేగాల ప్రవాహం.. కంటతడి పెట్టించిన పదహారవ ఎపిసోడ్

నంద్యాలలో 'శిల్పా మహిళా సహకార బ్యాంక్' ప్రారంభం -మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి

Select Suryaa Now
నంద్యాలలో 'శిల్పా మహిళా సహకార బ్యాంక్' ప్రారంభం -మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి

నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ లో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ నూతన కార్యాలయం గురువారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి మరియు బ్యాంక్ చైర్ పర్సన్ నాగిని రవిసింగారెడ్డి విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి నూతన కార్యలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మనేజర్ హరిలీల, సిబ్బంది, మాజీ మహిళా మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, ఖాతాదారులు, మహిళలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ... గత 16 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా మహిళల ఆర్థిక సాధికారత కోసం ఈ సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళల నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొంటూ ఈ సహకార బ్యాంక్ అంచెలంచెలుగా ఎదుగుతోందని పేర్కొన్నారు. మహిళలు ఈ బ్యాంక్ ద్వారా అందుతున్న ఆర్థిక సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.