BREAKING
ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం శర్వానంద్ జార్జ్ క్రిష్ మూవీ నుంచి స్పెషల్ బూస్టర్ అప్డేట్.. డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్ నిఘా వ్యవస్థకు గ్రహణం.! కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఆంధ్రప్రదేశ్ అంతర్గత జల మార్గముల బలోపేతం, కార్గో మరియు టూరిజం అభివృద్ధికి సహకరించండి. నల్లగొండ జిల్లా .... యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్. వినాయకుడిని దర్శించుకున్న డీఎస్పీ బాధిత చిన్నారులకు భరోసా..! బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గంగ సూర్యనారాయణ ది ప్యారడైజ్ మూవీ స్పెషల్ సాంగ్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కీర్తి సురేష్.. నెట్టింట వైరల్ మండల ప్రత్యేక అధికారిగా హరిగోపాల్ బాధ్యతలు ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ధ్యేయం.. గొల్లపల్లిలో విషాదం.. మాజీ ఎంపీటీసీ ఆకస్మిక మృతి బాధ్యతలు చేపట్టిన మండల ప్రత్యేక అధికారి పూర్వ విద్యార్థుల సౌజన్యంతో 190 హౌస్‌ డ్రెస్సుల పంపిణీ... పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే కీలకం: హోంమంత్రి వంగలపూడి అనిత

ఫేమస్ కాకముందే ఎక్కువ సంపాదించేదాన్ని.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న కుమారి ఆంటీ

Select Suryaa Now
ఫేమస్ కాకముందే ఎక్కువ సంపాదించేదాన్ని.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న కుమారి ఆంటీ

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సోషల్ మీడియాలో ఒక్క మాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హైదరాబాద్ ఫేమస్ ఫుడ్ వెండర్ కుమారి ఆంటీ తాజాగా తన వ్యక్తిగత జీవితం, వ్యాపార విశేషాలు మరియు సినిమా ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీది మొత్తం వెయ్యి అయింది, రెండు లివర్స్ ఎక్స్‌ట్రా అంటూ ఆమె మాట్లాడిన డైలాగ్ నెట్టింట తెగ వైరల్ కావడంతో పాటు ఆమెకు అపారమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ వచ్చిన క్రేజ్‌తోనే ఆమె పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోవడమే కాకుండా, తన వ్యాపారాన్ని కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సంపాదన, గైరాకీల తీరుపై ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు.

గతంలో తాను పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ, హైదరాబాద్‌కు రాకముందు ఊళ్లో పొలం పనులు చేస్తూ మెషిన్ కుట్టేదానినని, ఆ రోజుల్లో తనకు రోజుకు కేవలం యాభై రూపాయలు మాత్రమే ఇచ్చేవారని కుమారి ఆంటీ తెలిపారు. భర్తతో కలిసి నగరానికి వచ్చి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఈ చిన్న ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించానని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా తాను ఫేమస్ కావడానికి ముందే తన హోటల్‌కు భారీగా గిరాకీ ఉండేదని, అప్పట్లో రోజుకు సుమారు వెయ్యిన్నర మంది వరకు కస్టమర్లు వచ్చేవారని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కొందరు జనాలు భయపడి రావడానికి వెనుకాడినప్పటికీ, చాలామంది కొత్త వాళ్ళు కూడా తన షాపును వెతుక్కుంటూ వస్తున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం తన హోటల్ వ్యాపారం ద్వారా రోజుకు సుమారు ఇరవై వేల రూపాయల వరకు కౌంటర్ సేల్ అవుతోందని, అయితే దానికి తగినట్లుగానే నిర్వహణ ఖర్చులు కూడా ఉంటున్నాయని ఆమె స్పష్టం చేశారు. కేవలం వ్యాపారంతో సరిపెట్టకుండా ప్రస్తుతం వరుసగా ఏడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ నటిగానూ రాణిస్తున్నట్లు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది తనకు బిగ్‌బాస్ షో నుంచి అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయానని, ఒకవేళ ఈసారి కనుక మళ్లీ ఆఫర్ వస్తే మాత్రం అస్సలు వదులుకోనని కుమారి ఆంటీ తేల్చిచెప్పారు. ఆమె చెప్పిన ఈ ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.