10th class విద్యార్థికి లక్ష బహుమతి
తుర్క ఏంజాల్, మేజర్ న్యూస్,( సెప్టెంబర్ 24 ) : ఎస్‌ఎస్‌సీ మార్చి–2026 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తొర్రూర్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి సునిగంటి చరణ్‌కు రూ.1 లక్ష నగదు బహుమతి లభించింది.ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయిలో ప్రథమ, రంగారెడ్డి జిల్లా స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన చరణ్‌ను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సన్మానించి నగదు బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా చరణ్, అతని తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.వెంకట రెడ్డిని గవర్నర్ అభినందించారు.చరణ్ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
సోర్స్ ఎడ్ల వెంకటేష్