BREAKING
ఊపిరితిత్తులను నిర్లక్ష్యం చేయొద్దు! పీవోజేకేలో శాంతియుత నిరసనలపై పాక్ ఉక్కుపాదం: స్వతంత్ర విచారణ కమిషన్ వేయాలని ఐరాసను కోరిన హక్కుల కార్యకర్తలు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మైదుకూరులో హాట్ కామెంట్స్ అమెరికా బెదిరింపులను తిరస్కరించిన ఇరాన్: బలప్రయోగం లేని సమానత్వ చర్చలకు సిద్ధమని స్పష్టీకరణ దేవుని కడపలో పవిత్రోత్సవాలు ప్రారంభం భారీ వర్షాలపై విశాఖ కలెక్టర్ సమీక్ష: అధికారులకు హైఅలర్ట్, తక్షణమే నష్టం అంచనాకు ఆదేశాలు ఎర్రచందనం మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ జాకీర్ కు రిమ్స్ లో చికిత్స టీపీసీసీ చీఫ్ ను కలిసిన వసంతం రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. సుకుమార్ తదుపరి చిత్రం కోసం ఏకంగా 15 కిలోలు తగ్గుతున్న మెగా హీరో ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం శర్వానంద్ జార్జ్ క్రిష్ మూవీ నుంచి స్పెషల్ బూస్టర్ అప్డేట్.. డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్ నిఘా వ్యవస్థకు గ్రహణం.! కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఆంధ్రప్రదేశ్ అంతర్గత జల మార్గముల బలోపేతం, కార్గో మరియు టూరిజం అభివృద్ధికి సహకరించండి. నల్లగొండ జిల్లా .... యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్.

బాధిత చిన్నారులకు భరోసా..! బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గంగ సూర్యనారాయణ

Select Suryaa Now
బాధిత చిన్నారులకు భరోసా..!  బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గంగ సూర్యనారాయణ

బాధిత చిన్నారులకు భరోసా

పోక్సో బాధిత బాలికకు అండగా ఉంటాం

జీజీహెచ్‌లో మూడు నెలల శిశువు ఆరోగ్యంపై ఆరా

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గంగ సూర్యనారాయణ

కాకినాడ: పోక్సో కేసులో బాధితురాలైన ఎనిమిదేళ్ల బాలికకు అవసరమైన విద్య, వైద్యం, మానసిక సహాయంతో పాటు పునరావాస సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గంగ సూర్యనారాయణ తెలిపారు. కాకినాడలోని వన్‌స్టాప్‌ సెంటర్‌లో తాత్కాలిక సంరక్షణ పొందుతున్న బాలికను గురువారం ఆయన పరామర్శించారు.

బాలిక ఆరోగ్యం, భద్రతతో పాటు ప్రస్తుతం అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో ఆమెకు అవసరమైన సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తాళ్లరేవుకు చెందిన నడింపల్లి వినోద్ ఆయన వెంట ఉన్నారు.

శిశువు ఆరోగ్యంపై ఆరా

అనంతరం చట్టవిరుద్ధ దత్తతకు సంబంధించిన కేసులో శిశుగృహం సంరక్షణలో ఉన్న మూడు నెలల శిశువు ఆరోగ్య సమస్యలతో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గంగ సూర్యనారాయణ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి శిశువు ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు.

శిశువుకు మెరుగైన వైద్యం, నిరంతర పర్యవేక్షణతో పాటు అవసరమైన పోషణ, ప్రత్యేక సంరక్షణ అందించాలని సూచించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో శిశువు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను కోరారు.

కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి జాగరపు విజయ, వన్‌స్టాప్‌ సెంటర్‌ నిర్వాహకురాలు శైలజ, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సమన్వయకర్త విజయ్‌, నాగలక్ష్మి, కేస్‌ వర్కర్‌ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.