BREAKING
వ్యర్థాలతో విలువైన వస్తువుల తయారీపై విద్యార్థులకు అవగాహన రాజంపేట లో జనసేన జోరు,,చేరికల హోరు ఎర్రచందనం స్మగ్లర్ చేతుల్లో గాయపడ్డ పోలీసులను పరామర్శిస్తున్న జిల్లా ఎస్పీ యానిమల్ లుక్‌ను తలపిస్తున్న రణ్‌బీర్ కపూర్.. లవ్ అండ్ వార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ‘One Family - One Entrepreneur’ MSME వర్క్‌షాప్ దసరా, దీపావళి పండుగల వేళ చెక్కెర ధరలు అందుబాటులోనే: ఇస్మా స్పష్టీకరణ 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె..! మనమంతా యాంటీ జగన్ – వైసీపీ విధానాలకు మళ్లీ అవకాశం ఇవ్వకూడదు 20 ఏళ్ల తర్వాత మ్యాజికల్ కాంబో రిపీట్.. బాలీవుడ్ హీరోతో ప్రముఖ సంగీత దర్శకుడి రీ-యూనియన్ ఊపిరితిత్తులను నిర్లక్ష్యం చేయొద్దు! పీవోజేకేలో శాంతియుత నిరసనలపై పాక్ ఉక్కుపాదం: స్వతంత్ర విచారణ కమిషన్ వేయాలని ఐరాసను కోరిన హక్కుల కార్యకర్తలు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మైదుకూరులో హాట్ కామెంట్స్ అమెరికా బెదిరింపులను తిరస్కరించిన ఇరాన్: బలప్రయోగం లేని సమానత్వ చర్చలకు సిద్ధమని స్పష్టీకరణ దేవుని కడపలో పవిత్రోత్సవాలు ప్రారంభం భారీ వర్షాలపై విశాఖ కలెక్టర్ సమీక్ష: అధికారులకు హైఅలర్ట్, తక్షణమే నష్టం అంచనాకు ఆదేశాలు

నిఘా వ్యవస్థకు గ్రహణం.!

Select Suryaa Now
నిఘా వ్యవస్థకు గ్రహణం.!

రాజేంద్రనగర్    జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి.?

గండిపేట్, మేజర్ న్యూస్  (సెప్టెంబర్ 24) :
కార్యాలయానికి వచ్చే ప్రజల ప్రతి కదలికను గమనించేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. కిస్మత్‌పూర్‌లోని రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రత కోసం లక్షల రూపాయలు వెచ్చించి కెమెరాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ, పనితీరుపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

ప్రజలు నిత్యం వివిధ పనుల కోసం కార్యాలయానికి వస్తుంటారు. ఇలాంటి చోట నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కెమెరాల పరిస్థితిపై అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కెమెరాలు పనిచేయకపోతే వాటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగిన తర్వాత హడావుడి చేసే పరిస్థితి కాకుండా, ముందుగానే నిఘా వ్యవస్థను తనిఖీ చేసి లోపాలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాలయంలోని అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? రికార్డింగ్ జరుగుతోందా? ఫుటేజీ భద్రంగా ఉందా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్‌ఎంసీ అధికారులు నిద్రమత్తు వీడి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, లోపాలుంటే తక్షణమే సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థను నిర్లక్ష్యానికి గురిచేయకుండా బాధ్యతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

రిపోర్టర్ : అంకం గోపాల్.